Rahul sipleiganj: కొత్త అమ్మాయితో దర్శనం ఇచ్చిన రాహుల్ సిప్లీగంజ్.. ఆ మావా.. ఏంటి కథ..?

Rahul sipleiganj: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పలు పాటలు అండ్ ప్రైవేట్ ఆల్బమ్స్ పాడి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ సింగర్. ముఖ్యంగా తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ షోలో పాల్గొని పాపులారిటీ సంపాదించుకున్నాడు. హౌస్ లో అన్ని టాస్కుల్లో పోటా పోటీగా ఆడి చివరకు విన్నర్ గా కప్ గెలుచుకున్నాడు.

దీంతో రాహుల్ ఒక్కసారిగా ఫుల్ ఫేమస్ అయిపోయాడు. అయితే హౌస్ లో ఉండగానే నటి పునర్నవి తో రిలేషన్ ఏర్పరుచుకున్నాడు ఈ సింగర్. కానీ ఆ తర్వాత వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని తెలియజేశారు. ఇక‌ రాహుల్ బిగ్ బాస్ కంటెస్టెంట్ రతిక తో కూడా ప్రేమాయణం నడిపాడు. వీరిద్దరి మధ్య మనస్పార్ధాలు రావడంతో విడిపోయినట్లు రతిక తెలియజేసింది.

 

View this post on Instagram

 

A post shared by Rahul Sipligunj (@sipligunjrahul)

ఇక తాజాగా ఓ అమ్మాయికి స్పెషల్ విషెస్ చెబుతూ ఓ వీడియోని షేర్ చేయడంతో ప్రెజెంట్ అది కాస్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఓ అమ్మాయి తో కలిసి రీల్ చేసిన వీడియోను షేర్ చేస్తూ..” నా అట్లాంటిస్ రాణి కి పుట్టినరోజు శుభాకాంక్షలు ” అని క్యాప్షన్ ఇచ్చాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో చెక్కరలు కొడుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు