Rahul Yadav Nakka : సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాడు , సినిమా ప్రొడ్యూసర్ అయ్యాడు

Rahul Yadav Nakka : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంతోమంది నిర్మాతలు ఉన్నారు. ఒక కథను నమ్మి సినిమాను నిర్మించడం అనేది మామూలు విషయం కాదు. దర్శకుడు ఆలోచనను నమ్మాలి అంటే అది చాలా రిస్క్ తో కూడుకున్న పని. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ ప్రొడ్యూసర్స్ లో రాహుల్ యాదవ్ నక్కా ఒకరు. రాహుల్ యాదవ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు గౌతం తిన్ననూరిని దర్శకుడుగా మళ్లీ రావా అనే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఆ తర్వాత ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే సినిమాతో స్వరూప్ ను దర్శకుడుగా పరిచయం చేశాడు. ఆ తర్వాత మసూద సినిమాతో మరోదర్శకుడుని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అందించాడు..

అయితే ఈ రోజుల్లో ఒక సినిమా హిట్ అవ్వడం అనేది గగనం. అలాంటిది కొత్త దర్శకులతో మూడు హిట్ సినిమాలను తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అందించాడు రాహుల్. దీనికి కారణం ఏంటంటే డైరెక్ట్ గా నేరేషన్ వినకుండా స్క్రిప్ట్ చదువుతాడు. స్క్రిప్ట్ చదివిన తర్వాత తనకంటూ ఒక ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాడు. అవును నోట్స్ తో పాటు ఆ తర్వాత ఫిలిం మేకర్స్ తో ఒక పది నుంచి 12 గంటలు పాటు సినిమా గురించి డిస్కషన్స్ పెడుతూ ఉంటాడు. దీంతోపాటు ప్రీ ప్రొడక్షన్ కి పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ టైం దర్శకుడికి ఇస్తూ ఉంటారు. అందుకే రాహుల్ యాదవ్ నిర్మించే సినిమాలకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది.

గౌతమ్ పరిచయం

ఇకపోతే అసలు రాహుల్ యాదవ్ ప్రొడ్యూసర్ గా ఎలా అడుగులు వేసాడు అంటే, బీటెక్ అయిపోయిన తర్వాత వాళ్ల ఫ్రెండ్స్ అంతా అమెరికా వెళ్లడం మొదలుపెట్టారు. ఆ తరుణంలో ఎక్కడికో వెళ్ళకుండా ఇక్కడే ఉండి ఏదో ఒకటి డిఫరెంట్ గా చేయాలి అనే ఆలోచనలో ఉండేవాడు. ఎన్జీవో సంస్థలకు కూడా ఒకటి రెండేళ్లు పనిచేశాడు. ఆ తర్వాత సివిల్స్ కూడా ప్రిపేర్ అవుదాం అని ఆ పనిలో కూడా ఉండేవాడు. అయితే ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా గౌతం ను కలిశాడు రాహుల్. అయితే ఆ టైంలో గౌతమ్ చేతిలో స్క్రిప్ట్ ఉంది. ఒకసారి చదవచ్చా అని అడిగాడు రాహుల్. ఆ స్క్రిప్ట్ చదివిన తర్వాత ఆ సినిమాలో ఆ స్క్రిప్ట్ లోని కొన్ని డైలాగ్స్ రాహుల్ ని వెంటాడుతూ ఉండేది. మొత్తానికి ఆ సినిమాను తనే ప్రొడ్యూస్ చేసి డైరెక్షన్ ట్రైల్స్ లో ఉన్న గౌతమ్ కి అవకాశాన్ని ఇచ్చాడు.

- Advertisement -

 

ఇక మళ్ళీ రావా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు సుమంత్ కెరియర్ అయిపోయింది అనుకునే టైంలో మంచి హిట్ అయింది ఆ సినిమా. ఇక ప్రస్తుతం నాని విజయ్ దేవరకొండ వంటి హీరోలతో గౌతమ్ సినిమాలు చేసే స్థాయికి వచ్చాడు. రాహుల్ వరుసగా హిట్ సినిమాలు నిర్మిస్తూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి పేరును సాధించుకున్నాడు. తన ప్రొడక్షన్ నుంచి ఐదుగురు కొత్త డైరెక్టర్లను ఇంట్రడ్యూస్ చేస్తానంటూ చెప్పాడు రాహుల్. వారిలో ఇదివరకే ముగ్గురు దర్శకులను తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అందించాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు