Raj Kumar Kasi Reddy Arrest : బెట్టింగ్ రైడ్ లో అడ్డంగా దొరికిపోయిన మూవీ టీం… ప్రొడ్యూసర్లే పట్టించారా?

Raj Kumar Kasi Reddy Arrest : సినిమా ప్రమోషన్లను వినూత్నంగా చేయాలనే ఉద్దేశంతో ఒక్కోసారి నటీనటులు చేసే పనులు విమర్శలకు దారితీస్తాయి. తాజాగా ఓ మూవీ ప్రమోషన్లలో భాగంగా అరెస్ట్ అయినట్టుగా ఇద్దరు యాక్టర్లు చేసిన వీడియోపై ప్రమోషన్ల కోసం ఇంతకు దిగజారుతారా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంతకీ వివాదం ఏంటంటే?

బెట్టింగ్ రైడ్ లో అడ్డంగా దొరికిన మూవీ టీం

అంజిత్ కొయ్య, రాజ్ కుమార్ కసిరెడ్డి కలసి నటిస్తున్న తాజా మూవీ ఆయ్. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాను ఆగస్టు 15న థియేటర్లలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం చేసిన ప్రమోషనల్ స్టంట్ మాత్రం పైత్యం ముదిరిందా అని ఫైర్ అయ్యేలా చేసింది. సినిమాపై కావలసినంత బజ్ లేకపోవడంతో హైప్ క్రియేట్ చేసేందుకు అంజిత్, కసి రెడ్డి కలిసి వీడియోను రిలీజ్ చేశారు. అందులో వీరిద్దరూ బెట్టింగ్ కేసులో అరెస్ట్ అయినట్టుగా కనిపించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఓ ఫ్లాట్ లో ఇద్దరూ బెట్టింగ్ నిర్వహిస్తుండగా పోలీసులు వచ్చి వీరిద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్నట్టుగా ఆ వీడియోలో ఉంది. అంతేకాకుండా అదే సమయంలో రాజ్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఏడాదికాలంగా సినిమాను తీస్తున్నా ప్రమోషన్స్ విషయాన్ని నిర్మాత బన్నీ వాస్ పట్టించుకోవట్లేదని చెప్పాడు. అందుకే తనను పోలీసులు అరెస్టు చేశారని చెప్పామని, ఇప్పుడు ఆయన మా కోసం వస్తాడంటూ ఇది సినిమా ప్రమోషన్ అనే చావు కబురు చల్లగా చెప్పారు.

- Advertisement -

AAY (2024) - IMDb

ప్రమోషన్ల కోసం ఇంతకు దిగజారుతారా?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ అవుతుండగా, చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెట్టింగ్ రైడ్ లో అడ్డంగా దొరికిపోయిన ఆయ్ టీం అనే వార్త క్షణంలో వైరల్ కావడంతో పాటు వివాదానికి దారి తీసింది. చాలామంది ఇలా సినిమాల కోసం జనాలను పిచ్చోళ్లను చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ మండి పడుతున్నారు. సినిమా ప్రమోషన్ల కోసం ఇంతకు దిగజారుతారా అంటూ ఫైర్ అవుతున్నారు. ఇటీవల రోహిణి కూడా రేవ్ పార్టీలో అరెస్ట్ అయినట్టుగా ఓ వీడియోను సోషల్ మీడియాలో వదిలగా, అది దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే రోహిణి విషయం వివాదాస్పదం కావడంతో ఆమె దిగొచ్చి వివరణ ఇవ్వగా, ఆ సమస్య సద్దుమణిగింది. అయితే ఇప్పుడు అదే బాటలో ఈ ఇద్దరు నటులు కూడా ఆయ్ సినిమాను ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేయడం మరోసారి చర్చకు దారి తీసింది. అయితే వాళ్లు అనుకున్నట్టుగానే సినిమాకు ప్రమోషన్ అయితే జరిగింది కానీ, దాంతో పాటే వివాదం కూడా మొదలైంది. అయితే ఈ వివాదం నెగటివ్ గా మారి ఆయ్ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా జనాలకు తెలియకుండా పోయే ప్రమాదం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు