Raj Tarun: ఛీ.. ఛీ.. రాజ్ తరుణ్ ఇలాంటి వాడా.. లవర్ చెప్పింది వింటే..?

Raj Tarun.. ప్రముఖ టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ఇటీవల నాగార్జునతో కలిసి నా సామిరంగా సినిమాలో నటించిన విషయం తెలిసిందే.. ఇక ప్రస్తుతం అడపా దడపా సినిమాలలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. చాలావరకు వివాదాలకు, రూమర్స్ కి చోటు ఇవ్వని రాజ్ తరుణ్ గురించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తోంది.. నన్ను మోసం చేశాడు.. పెళ్లి చేసుకుని.. జీవితాంతం ఉంటానని నమ్మించి ఇప్పుడు వదిలేసాడు అంటూ లావణ్య అనే ఒక అమ్మాయి రాజ్ తరుణ్ పై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

Raj Tarun: Chee.. Chee.. Raj Tarun is like this.. If you listen to what the lover says..?
Raj Tarun: Chee.. Chee.. Raj Tarun is like this.. If you listen to what the lover says..?

ప్రేమించి, పెళ్లి చేసుకొని మోసం చేశాడు..

అసలు విషయంలోకి వెళ్తే.. లావణ్య అనే అమ్మాయి ఇప్పుడు రాజ్ తరుణ్ పై చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.. రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య తనను పెళ్లి చేసుకుని.. జీవితాంతం తోడుగా వుంటానని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని.. అందుకు ఒక సినీ నటే కారణమని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే సినీ నటితో పాటు ఆమె సోదరుడిపై నార్సింగి పోలీస్ స్టేషన్లో లావణ్య ఫిర్యాదు చేసింది..రాజ్ తరుణ్ ను వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారట.. 11 ఏళ్లుగా రాజ్ తరుణ్ తో రిలేషన్షిప్ లో ఉన్నాను.. గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాం .. కానీ తన సినిమాలో నటిస్తున్న హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకొని ఇప్పుడు నన్ను వదిలేశాడు .. దాదాపు మూడు నెలల క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటున్నాడు.. రాజ్ ను వదిలేయకపోతే.. నన్ను చంపేసి నా బాడీ కూడా మాయం చేస్తానని బెదిరిస్తున్నారు.. దయచేసి నాకు న్యాయం చేయండి ..రాజ్ తరుణ్ నా ప్రపంచం.. అతడి నాకు కావాలి నాకు న్యాయం చేయండి అంటూ అభ్యర్థన చేస్తోంది లావణ్య..

డ్రగ్స్ కేసులో ఇరికించారు కూడా..

అంతేకాదు తనను కావాలనే డ్రగ్స్ కేసులో ఇరికించారని.. అరెస్ట్ అయ్యి 45 రోజులు జైల్లోనే ఉన్నాను.. ఆ సమయంలో నాకు రాజ్ ఎలాంటి సహాయం చేయలేదు అంటూ లావణ్య వెల్లడించింది.. ఇక ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.. ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలకు రూమర్స్ కి చోటు ఇవ్వని రాజ్ తరుణ్ పై ఆయన భార్య ఇలాంటి కామెంట్లు చేయడం గమనార్హం.. అంతేకాదు పెళ్లి జరిగిందని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. సాధారణంగా ఒక సెలబ్రిటీకి సంబంధించిన ఏ విషయమైనా సరే క్షణాల్లో వైరల్ అవుతుంది. మరి వీరిద్దరూ గత పదకొండేళ్లుగా రిలేషన్ లో ఉన్నామంటూ లావణ్య చెబుతోంది.. మరి లావణ్య చెప్పే మాటల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈమె రాజ్ తరుణ్ పై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -

రాజ్ తరుణ్ సినిమాలు..

రాజ్ తరుణ్ కెరియర్ విషయానికి వస్తే.. ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన ఈయన .. సినిమాల్లోకి రాకముందు షార్ట్ ఫిలిమ్స్ చేసేవాడు.. 1993 మే 11న విశాఖపట్నంలో జన్మించిన 2013లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఇప్పటికీ హీరోగా , రచయితగా కొనసాగుతున్నారు. ఇక ప్రస్తుతం ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో వస్తున్న తిరగబడరా సామి, మారుతి డైరెక్షన్ లో వస్తున్న భలే ఉన్నాడే చిత్రాలలో నటిస్తున్నారు. సినిమాలే కాదు వెబ్ సిరీస్లలో కూడా నటించారు రాజ్ తరుణ్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు