Raj Tarun Controversy : రాజ్ తరుణ్‌పై కేసు పెట్టిన లావణ్య గురించి తెలుసా…? ఇద్దరూ కలిసి ఇంత స్టోరీ నడిపారా?

Raj Tarun Controversy : టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ తాజాగా కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఆయన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ లావణ్య ఈ హీరో తనను మోసం చేశాడంటూ కేసు పెట్టి బాంబ్ పేల్చింది. అయితే వెంటనే రాజ్ తరుణ్ స్పందించినప్పటికీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అసలు ఈ లావణ్య ఎవరు? వీరిద్దరి సమస్య ఏంటి? అనే విషయం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

రాజ్ తరుణ్‌పై కేసు పెట్టిన లావణ్య ఎవరంటే?

ప్రస్తుతం టాలీవుడ్ లో వైరల్ అవుతున్న పేరు లావణ్య… ఏకంగా హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ రచ్చ చేయడంతో అసలు ఆమె ఎవరు అనే క్యూరియాసిటీ నెలకొంది. లావణ్య ఒక మ్యూజిషియన్. అయితే ఈమెకు టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ కు 2011లో పరిచయం ఏర్పాడింది. అంటే రాజ్ తరుణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే వీరిద్దరికి పరిచయం ఉంది. అయితే రాజ్ తరుణ్ 2013లో ఉయ్యాల జంపాల అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.

అంతకంటే ముందే ఈ హీరో షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచే రాజ్ తరుణ్, లావణ్యల మధ్య పరిచయం ఏర్పడి, అది కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే దాదాపు 11 ఏళ్లుగా వీరిద్దరూ లివింగ్ రిలిషన్ ఉన్నారని, అంతేకాకుండా రాజ్ తరుణ్ తనని గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాడని లావణ్య ఆరోపణలు చేసింది. కానీ మరో హీరోయిన్ తో పరిచయం ఏర్పడటంతో రాజ్ తరుణ్ తనని మోసం చేసి వదిలేసి వెళ్లిపోయాడని వాపోయింది. ఇకపోతే గతంలో వరలక్ష్మీ టిఫిన్స్‌ అధినేతపై నమోదైన డ్రగ్స్‌ కేసులో కూడా లావణ్య పేరు బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

- Advertisement -

Raj Tarun Girlfriend: Raj Tarun: ఆ హీరోయిన్‌తో రాజ్‌ తరుణ్ ఎఫైర్.. బాంబ్ పేల్చిన ప్రేయసి. | Raj Tarun | Head Topics

మరో హీరోయిన్ తో రాజ్ తరుణ్ ఎఫైర్

రీసెంట్ గా డ్రగ్స్ కేసులో లావణ్య పేరు బయటకు వచ్చినప్పుడు కూడా ఆమె రాజ్ తరుణ్‌ లవర్ అనే వార్తలు విన్పించాయి. లావణ్య ఆరోపణల ప్రకారం 11 ఏళ్లుగా ఆమెతో కలిసి ఉంటున్న రాజ్ తరుణ్ మరో హీరోయిన్ మోజులో పడి తనను మోసం చేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం మల్హోత్రా అనే హీరోయిన్‌తో రాజ్ తరుణ్ ఎఫైర్ నడిపిస్తున్నాడని అంటున్నారు. తనను 45 రోజుల పాటు అరెస్టు చేసినప్పుడు ఈ హీరో తనను విడిచి పెట్టడంటూ వాపోయింది లావణ్య.

అయితే ఈ వార్త క్షణాల్లో వైరల్ కావడంతో రాజ్ తరుణ్ ఆ ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. తనకు, లావణ్యకు గతంలోనే రిలేషన్‌షిప్ ఉందని ధృవీకరించాడు. అయితే ఆమె కొంతకాలంగా డ్రగ్స్ తీసుకుంటోందని, మరో వ్యక్తితో ఆమెకు అక్రమ సంబంధం కూడా ఉందని, అందుకే ఆమెను దూరం పెట్టానని స్పష్టం చేశారు. లావణ్యకి తన దగ్గర డబ్బులు కావాలనీ, అదే ఈ డ్రామాకి కారణమని అంటున్నాడు. ఆమె తనను హింసించిందని, తన తండ్రిని కూడా మోసం చేసిందని అతను చెప్పాడు. చాలా కాలం క్రితమే తాము విడిపోయామని, ఆమెపై చాలా కేసులు ఉన్నాయని రాజ్ తరుణ్ వెల్లడించారు. అంతేకాదు ఆమెను పెళ్లి చేసుకోనని, ఆమె చెప్పేది నమ్మవద్దని మీడియాను, ప్రజలను కోరాడు. మరి ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు