Raj Tarun Controversy : కాంట్రవర్సీలో కొత్త ట్విస్ట్… లావణ్యపై రాజ్ తరుణ్ పేరెంట్స్ కంప్లైంట్

Raj Tarun Controversy : టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ అమ్మాయి వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. సినిమా స్టోరీ కంటే ఇంట్రెస్టింగ్ గా రోజుకో ట్విస్ట్ తో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా లావణ్యపై హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

లావణ్యపై కంప్లయింట్

రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బసవరాజు, రాజ్యలక్ష్మి గురువారం రాత్రి ఆయన మాజీ లవర్ లావణ్య పై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మాదాపూర్ లోని కాకతీయ హిల్స్ లో నివాసం ఉంటున్నారు. అయితే బుధవారం రోజు రాత్రి లావణ్య ఏకంగా రాజ్ తరుణ్ ఇంటికి వెళ్లి గొడవ చేసిందని సమాచారం. గట్టిగా తలుపులను బాదుతూ అక్కడ నానా హంగామాను క్రియేట్ చేసిందని, అంతేకాకుండా తమపై దాడికి ప్రయత్నించింది అని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్య పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలే తమకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయని, ఇప్పుడు లావణ్య వల్ల తమకు ప్రాణహాని ఉందంటూ ఆ కంప్లైంట్ లో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు పేర్కొన్నారు.

Raj Tarun's parents : మాదాపూర్ పీఎస్ లో లావణ్య పై హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రుల ఫిర్యాదు

- Advertisement -

పోలీస్ ప్రొటెక్షన్ కోసం రిక్వెస్ట్

ఇక ఈ నేపథ్యంలోనే రాజ్ తరుణ్ లాయర్ మాట్లాడుతూ విషయాన్ని వివరించారు. గతంలో లావణ్యకు నేర చరిత్ర ఉందని, ఆమె వల్ల రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని వెల్లడించారు. రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు హైబీపీతో కూడిన ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయని, ప్రస్తుతమున్న పరిస్థితుల్లో లావణ్య వారిని ఏమైనా చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కావాలనే లావణ్య రాజ్ తరుణ్ ఇంటి వద్దకు వెళ్లి ఆయన పేరెంట్స్ ని బెదిరించిందని, ఈ క్రమంలో వారికి పోలీసు ప్రొటెక్షన్ కావాలని తెలిపారు. అంతేకాకుండా లావణ్య కు సంబంధించిన అన్ని ఆధారాలు రాజ్ తరుణ్ దగ్గర ఉన్నాయని అంటూ కోర్టులో ఈ వ్యవహారంపై తాము న్యాయపరంగా పోరాడుతామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ప్రతిచోటా విమెన్ విక్టిమ్ కార్డు పని చేయదని అన్నారు. మరోవైపు సోషల్ మీడియాలో లావణ్య శేఖర్ భాషని చెప్పుతో కొట్టిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతుంది. ఆమె లైవ్ లో ఏకంగా అతనిపై చెప్పు విసరడం హాట్ టాపిక్ గా మారింది. రాజ్ తరుణ్ కు క్లోజ్ ఫ్రెండ్ అయిన శేఖర్ భాష గత కొన్ని రోజులుగా లావణ్య కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు