Raj Tarun : ఫ్యానిజం గుండెల్లో ఉండాలి , ఆర్టిఫీషియల్ గా సినిమాలో చూపించాల్సిన పనిలేదు

Raj Tarun : షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టి ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రాజ్ తరుణ్. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక మంచి హీరో దొరికాడు అని ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత రాజధాని చేసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఆ తర్వాత రాజ్ తరుణ్ కి వరుసగా అవకాశాలు రావడం మొదలైంది. కానీ రీసెంట్ టైమ్స్ లో రాజ్ తరుణ్ హిట్ సినిమా చేసి చాలా రోజులు అయింది.

ఇక ప్రస్తుతం రాజ్ తరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వర్ష వివాదాలు రాజ్ తరుణ్ మెడకు చుట్టుకుంటున్నాయి. తనని మోసం చేశాడు అనే లావణ్య ఒక అమ్మాయి రాజ్ తరుణ్ పై కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక నేడు తిరగబడరా స్వామి అనే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా రాజ్ తరుణ్ కి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడిగారు. ఇక ఈ సినిమా ఆగస్టు 2న రిలీజ్ కానుంది అయితే రాజ్ తరుణ్ చాలా అసహనం వ్యక్తం చేస్తూ అన్నిటికీ ఆన్సర్ చేశాడు.

Okkadu

- Advertisement -

లేకపోతే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన అభిమాన హీరో మహేష్ బాబు గురించి చెప్పుకొచ్చాడు రాజ్ తరుణ్. ఒక్కడు సినిమా చూసినప్పటి నుంచి మహేష్ బాబుకి చాలా పెద్ద ఫ్యాన్ అని. ఆయన ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు అభిమానం అనేది అలానే ఉండాలి ఆర్టిఫిషియల్ గా సినిమాల్లో పెట్టేసి ఆ పాటల్ని డైలాగులను వాడుకోలేను అంటూ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా కేవలం రాజ్ తరుణ్ మాత్రమే కాకుండా చాలామందికి ఒక్కడు సినిమా ఫేవరెట్ అని చెప్పొచ్చు మహేష్ బాబుని స్టార్ ను చేసిన సినిమా ఒక్కడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు