Raj Tarun – Lavanya: రాజ్ తరుణ్ పై కేస్ ఫైల్.. లావణ్య చెప్పిందంతా నిజమే..!

Raj Tarun – Lavanya.. టాలీవుడ్ ప్రముఖ యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) ఒక అమ్మాయిని దాదాపు 11 సంవత్సరాల పాటు ప్రేమించి , ఆమెను గర్భవతిని చేసి, ఇప్పుడు వివాహం చేసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు అంటూ ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు బాధిత అమ్మాయి కూడా మీడియా ముందుకు వచ్చి తనకు జరిగిన అన్యాయం గురించి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆ అమ్మాయి పేరు లావణ్య (Lavanya) . తాను రాజ్ తరుణ్ తో 11 సంవత్సరాలుగా రిలేషన్ కొనసాగిస్తున్నాను అంటూ తెలిపిన ఈమె , ప్రెగ్నెంట్ చేసి, అబార్షన్ కూడా చేయించాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Raj Tarun - Lavanya: Case file on Raj Tarun.. Everything Lavanya said is true..!
Raj Tarun – Lavanya: Case file on Raj Tarun.. Everything Lavanya said is true..!

ఇకపోతే రాజ్ తరుణ్ ఈ విషయంపై స్పందిస్తూ.. లావణ్య మాటలకు తనదైన శైలిలో కామెంట్లు చేశారు. ఆమెతో సహజీవనం చేసింది నిజమే , కానీ ప్రెగ్నెంట్ ను చేయలేదని, ఆమె ఇంకొకరితో ఎఫైర్ పెట్టుకోవడం , పైగా డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం వల్ల ఆమెకు దూరంగా ఉన్నానంటూ కామెంట్లు చేశారు. ఆ తర్వాత ఆమె సాక్షాలు బయట పెట్టడం, చాలామంది హీరోయిన్స్ తో ఎఫైర్ నడుపుతున్నాడు అంటూ కామెంట్లు చేయడం అన్నీ జరిగిపోయాయి. పైగా లావణ్య.. రాజ్ తరుణ్ తనకు కావాలి అని , మాల్వీ మల్హోత్రా వల్లే తనను దూరం పెట్టాడు అంటూ కూడా ఆరోపణలు చేసింది.

రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేర్చిన పోలీసులు..

ఇక మాల్వీ మల్హోత్రా కూడా లావణ్య పై కేసు ఫైల్ చేయించే ప్రయత్నం చేసింది. ఇక అలాగే లావణ్య పై రాజ్ తరుణ్ స్నేహితుడు శేఖర్ భాషా దాడి చేయడం, ఈమె అతడిని లైవ్ లో చెప్పుతో కొట్టడం అన్నీ కూడా జరిగిపోయాయి. ఇలా ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో తెగ సంచలనం సృష్టించాయి. అయితే తాజాగా పోలీసులు రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేరుస్తూ చార్జిషీట్ సమర్పించారు. తాజాగా రాజ్ తరుణ్ లావణ్య కేసులో పోలీసులు చార్జ్ షీట్ లో రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేరుస్తూ.. లావణ్యతో రాజ్ తరుణ్ పదేళ్లు సహజీవనం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

ముందస్తు బెయిల్ పొందిన రాజ్ తరుణ్..

రాజ్ తరుణ్ , లావణ్య దాదాపు పది సంవత్సరాల పాటు ఒకే ఇంట్లో ఉన్నారు అని , లావణ్య చెబుతున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయని, లావణ్య ఇంటివద్ద సాక్షాలు సేకరించిన పోలీసులు చార్జిషీటులో రాజ్ తరుణ్ నిందితుడిగా చేరుస్తూ కేసు ఫైల్ చేశారు. అయితే ఈ విషయంలో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ పొందిన విషయం తెలిసిందే. మరి దీంతో లావణ్యకు ఏ విధమైన న్యాయం జరుగుతుందో చూడాలి.. ఇకపోతే లావణ్య, రాజ్ తరుణ్ కేసులో రోజుకొక ట్విస్టు తెరపైకి వస్తోంది.

రాజ్ తరుణ్ సినిమాలు..

రాజ్ తరుణ్ సినిమాల విషయానికొస్తే ,ఇటీవల ఈయన నటించిన అన్ని సినిమాలు కూడా డిజాస్టర్ గానే నిలిచాయి. ఇటీవల ఈయన నటించిన తిరగబడరాసామి, పురుషోత్తముడు సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు