Raj Tarun: లావణ్య గుట్టు రట్టు చేసిన హీరో ఫ్రెండ్.. అతడితో ఎఫైర్ అంటూ.. ఆధారాలు బట్టబయలు..!

Raj Tarun..టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య అనే అమ్మాయితో గత కొన్నేళ్ళు గా సహజీవనం చేస్తున్నారనే విషయం వెలుగులోకి రావడంతో రోజు కొక ట్విస్టు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా రాజ్ తరుణ్, లావణ్యను పెళ్లి చేసుకుంటానని చెప్పి, శారీరకంగా వాడుకొని, ఆమెకు కడుపు చేసి మోసం చేశారని కూడా ఆమె ఆవేదన చెందుతూ రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకానీ రెండుసార్లు అబార్షన్ కూడా చేయించాడని, కానీ ఇప్పుడు తనని పెళ్లి చేసుకోకుండా హీరోయిన్ మాల్వితో తిరుగుతున్నారని కూడా ఆమె పైన కూడా కంప్లైంట్ చేయడం జరిగింది లావణ్య. అలాగే హీరోయిన్ మాల్వి పైన కూడా ఎన్నో విషయాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా రాజ్ తరుణ్ స్నేహితుడు ఆర్జె.. లావణ్య గురించి పలు విషయాలు తెలిపారు.

Raj Tarun: Lavanya character also bad..hero's friend shocking comments..!
Raj Tarun: Lavanya character also bad..hero’s friend shocking comments..!

లావణ్య క్యారెక్టర్ అలాంటిది..

ముఖ్యంగా లావణ్య క్యారెక్టర్ అసలు మంచిదే కాదని, ఆమె ఎప్పుడూ అబద్ధాలే చెబుతుందని, ఆమె డ్రగ్స్ కూడా అమ్మేదని, ఈ విషయంలో బుక్ అయ్యిందని రాజ్ తరుణ్ స్నేహితులలో ఒకరైన శేఖర్ బాషా ఆర్జే తెలియజేస్తున్నారు.. అలాగే లావణ్య గురించి మరొక విషయాన్ని తెలుపుతూ మస్తాన్ రావు అనే వ్యక్తి నుంచి లావణ్య మత్తు పదార్థాలను తీసుకునేది అంటూ తెలిపారు.

మస్తాన్ రావు తో ఎఫైర్..

ఆయన దగ్గర తక్కువ మొత్తంలో మత్తు పదార్థాలను తీసుకొని అధిక ధరకు బయట అమ్మేదని, ఆ పరిచయంతో ఇద్దరూ ఒకటయ్యారని కూడా శేఖర్ తెలియజేశారు.. మస్తాన్ రావు లావణ్య తరచూ కలుసుకునే వారని.. అలాగే మస్తాన్ రావుకి ఇతర అమ్మాయిలతో కూడా చాలానే ఎఫైర్స్ ఉన్నాయని, ఈ విషయం లావణ్యకు తెలిసి.. ఆమె మస్తాన్ రావుని ఎన్నోసార్లు నిలదీయగా, మస్తాన్ రావు మాత్రం వీరిద్దరూ కలిసిన పర్సనల్ వీడియోలను తీసి ఆమెను ఎన్నో సార్లు బ్లాక్ మెయిల్ చేశారని కూడా తెలియజేశారు.

- Advertisement -

ఆధారాలతో సహా..

అయితే ఇప్పుడు లావణ్య కూడా రాజ్ తరుణ్ విషయంలో అదే రూట్ లోనే వెళుతున్నట్లు శేఖర్ బాషా ఆరోపిస్తున్నారు.. గత ఏడాది గుంటూరులో పట్టాభిపురంలో లావణ్య మస్తాన్ రావు మీద ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయించిందని కూడా తెలియజేశారు శేఖర్ బాషా.. అక్కడ అసలు ఏం జరిగిందంటే మస్తాన్ చెల్లెలి పెళ్లికి లావణ్యను పిలిచారని.. ఆ పెళ్లి గుంటూరులో జరుగుతోందని ఆమెను పిలిపించి ఏకంగా లావణ్య మీద దాడి చేశాడని , అలాగే రేప్ కూడా చేశారని ఆమె కంప్లైంట్ కూడా ఇచ్చింది అంటూ తెలిపారు. అలాగే ఈమె ఎఫ్ఐఆర్ చేయించిన ఒక కాపీని కూడా శేఖర్ బయట పెట్టడం జరిగింది. అయితే దీంతో రాజ్ తరుణ్ అభిమానులు మాత్రం రోజుకొక ట్విస్టు తో ఇలా చేస్తున్నారు ఏంటి భయ్యా.. అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికైతే రాజ్ తరుణ్ బండారం బయటపెట్టిన లావణ్య కు ఊహించని ట్విస్ట్ ఇస్తూ.. రాజ్ తరుణ్ స్నేహితుడు ఆర్జే చేసిన కామెంట్ లావణ్యను చిక్కుల్లో పడేసిందని చెప్పవచ్చు. మరి దీని నుంచి లావణ్య ఎలా తప్పించుకుంటుంది..ఇవి నిజమని ఒప్పుకుంటుందా. లేక ఇవి కూడా అబద్దాలని ఆధారాలతో సహా బయట పెడుతుందా అనేది తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు