Raj Tarun – Lavanya: హీరోకి మ్యాటర్ లేదు.. అసలు విషయం బయటపెట్టిన సంయుక్త..!

Raj Tarun – Lavanya: గత కొన్ని వారాలుగా యంగ్ హీరో రాజ్ తరుణ్ వ్యవహారం సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హీరో రాజ్ తరుణ్, గత 11 సంవత్సరాలుగా తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఒకే ఇంట్లో సహజీవనం చేసిన తర్వాత దూరం పెట్టాడు అంటూ రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య ఆరోపణలు చేసింది. అంతేకాదు అక్కడితో ఆగకుండా ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. తాను గర్భం దాలిస్తే రాజ్ తరుణ్ ఏకంగా రెండు సార్లు అబార్షన్ చేయించాడని ఆరోపిస్తూ.. ఇందుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ అలాగే ఫోటోలు కూడా బయటపెట్టింది.

Raj Tarun - Lavanya: Hero doesn't matter.. Samyuktha revealed the truth..!
Raj Tarun – Lavanya: Hero doesn’t matter.. Samyuktha revealed the truth..!

సాక్షాదారాలతో రాజు తరుణ్ పై కేస్ ఫైల్..

ఇక వీటన్నింటినీ ఆధారం చేసుకున్న పోలీసులు రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేసి నోటీసులు కూడా ఇచ్చారు. అయితే వ్యక్తిగత పనుల కారణంగా పోలీసుల ఎదుట హాజరవ్వని రాజ్ తరుణ్ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కూడా పొందిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారం మధ్యలో అనేక మంది వ్యక్తులు తెరపైకి వచ్చారు. ముఖ్యంగా ఆర్జే శేఖర్ భాషా తెరపైకి వచ్చి వరుస పెట్టి చానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ అన్ని ఆధారాలు బయట పెడతానని చెప్పడమే కాదు లావణ్యాను బెదిరించాడు కూడా.. అంతేకాదు ఆమెపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. దీంతో లావణ్య తనకు ఏదైనా జరిగితే దానికి కారణం శేఖర్ భాష అంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసి మరీ ఫైల్ ను మీడియాకు సమర్పించింది.

మస్తాన్ సాయితో లావణ్య ఎఫైర్..

దీనికి తోడు లావణ్య మస్తాన్ సాయి అనే ఒక డ్రగ్గిస్ట్ తో రిలేషన్ లో ఉందని రాజ్ తరుణ్ ఆరోపించాడు. ఇతడిని ఇప్పటికే పోలీసులు డ్రగ్ కేసులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇతడు చాలా మంది అమ్మాయిలను ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజే ప్రయత్నం చేస్తున్నాడని వార్తలు బయటకు వచ్చాయి. ఇక తనను కూడా అలాగే బ్లాక్ మెయిల్ చేశాడని రాజ్ తరుణ్ ను కూడా చంపేస్తానని బెదిరించాడంటూ లావణ్య కూడా ఆరోపించింది. అయితే ఇలా ఒకటి తర్వాత ఒక ట్విస్ట్ వైరల్ గా మారడంతో ఇప్పుడు సడన్ గా ఇంకొక అమ్మాయి పేరు తెరపైకి వచ్చింది.

- Advertisement -

రాజ్ తరుణ్ లో మేటర్ లేదు..

ఆ వీడియోలో ఒక అమ్మాయి మాట్లాడుతూ.. నా పేరు సంయుక్త.. గత నెల నుంచి ఒక హీరో పై న్యూస్ లో బాగా వింటున్నాము. నిజం చెప్పాలంటే అసలు ఆ హీరోకి మేటర్ లేదండి. అలాంటి ఈ మనిషి ఇవన్నీ చేశాడంటే నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే గత సంవత్సర కాలంగా అతడు మా ఫ్రెండ్ తో రిలేషన్ లో ఉన్నాడు. వాళ్ళిద్దరూ కలిసి ఉండడం ఏమో కానీ.. ఆ పిల్ల ప్రతిరోజు నాకు ఫోన్ చేసి ఏడుస్తూ ఉంది.. ఇద్దరూ ఒకటే బెడ్ పై పడుకుంటారు.. కానీ ఈ హీరో మాత్రం అటు తిరిగి పడుకుంటాడట. చనవుగా దగ్గరకు వెళ్ళినా సరే ఆ మనిషి దూరం పెడతాడట. అప్పటికే అర్థం చేసుకోవాలి కదా అతడికి లో మేటర్ లేదని.. 27 సంవత్సరాలకి పెళ్లి చేసుకుంటానని చెప్పాడా.. ఇప్పుడు 30 సంవత్సరాలు వచ్చాయి. ఇంకో పది సంవత్సరాలు అయినా అతడు పెళ్లి చేసుకోడు.. ఎందుకంటే అతనిలో ఏం లేదు. సినిమాల్లో మాత్రం బానే చేసుకుంటాడు.. అంటే చూడడానికి బానే ఉంటాడు కానీ అతడిలో మేటర్ ఏమి లేదండి. ఆయన సినిమాల్లోనే హీరో బయట మాత్రం జీరో అంటూ ఒక అమ్మాయి ముఖానికి ముసుగు వేసుకొని మరి వీడియో రిలీజ్ చేసింది. మరి ఇలా ముఖానికి ముసుగు వేసుకొని మరీ రాజ్ తరుణ్ జీరో అంటూ చెప్పిన ఈ అమ్మాయి ఎవరు..? అసలు ఏం జరిగింది..? అనే విషయాలు త్వరలోనే తెలియనున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు