RajTarun – Lavanya: రాజ్ తరుణ్- లావణ్య వ్యవహారంపై బుల్లితెర నటి హాట్ కామెంట్స్..!

Raj Tarun – Lavanya: గత కొద్దిరోజుల నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరో రాజ్ తరుణ్ , లావణ్య, మాల్వీ మల్హోత్రాల గురించి ఎన్నో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. ఇప్పటివరకు వినని వార్తలు విన్న తర్వాత అభిమానులు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.. ఒకవైపు రాజ్ తరుణ్ వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ ముందుకు వెళుతుండగా, ఇలాంటి సమయంలోనే తనను ప్రేమించి 11 సంవత్సరాలు సహజీవనం చేసి, వాడుకొని వదిలేశారు అంటూ లావణ్య అనే అమ్మాయి రాజ్ తరుణ్ పైన కేసు పెట్టడం జరిగింది. ఇక అక్కడి నుంచి ఈ కేసు ఎన్నో మలుపులు తిరుగుతూనే ఉన్నది. ఈ వ్యవహారం మీద తాజాగా గుప్పెడంత మనసు నటి, మిర్చి మాధవి పలు విషయాలను తెలియజేసింది.

Raj Tarun - Lavanya: Hot comments of the TV actress on Raj Tarun- Lavanya affair..!
Raj Tarun – Lavanya: Hot comments of the TV actress on Raj Tarun- Lavanya affair..!

రాజ్ తరుణ్ – లావణ్య బంధం పై మిర్చి మాధవి కామెంట్స్..

మిర్చి మాధవి మాట్లాడుతూ.. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం ఒక నరకం లాంటిది అంటూ తెలియజేసింది.. ఒకవైపు పెళ్లి అయ్యిందని చెబుతూనే మరొక వ్యక్తితో పెళ్లి చేయాలని కేసులు పెట్టడానికి చూస్తే లావణ్య ఎక్కువగా కన్ఫ్యూజన్లో ఉన్నట్లు అనిపిస్తోంది అంటూ తెలుపుతోంది మిర్చి మాధవి.. లావణ్య ఎన్ని విషయాలు చెప్పినా కూడా తను అంటే నాకు వద్దని రాజ్ తరుణ్ డైరెక్ట్ గానే చెబుతున్నారు.. దీన్ని బట్టి చూస్తే ఆమె వద్దంటే వద్దు అని అర్థం.. ముఖ్యంగా ఆమెను వదిలించుకోవాలని చూస్తున్నాడా? ఆ లేకపోతే అమ్మాయినీ మానసికంగా వద్దనుకున్నాడా అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి అంటూ తెలిపారు.

రాజ్ తరుణ్ అంటే ఇష్టం.. మరి లావణ్య పద్ధతి ఏంటి..

లావణ్యతో రాజ్ తరుణ్ ఎలా కనెక్ట్ అవుతాడు..మొన్నటి వరకు కలిసి ఉండే ఆ అమ్మాయి, మస్తాన్ సాయిలతో ఎలా ఉన్నది అనే ఆధారాలు కూడా చూపిస్తున్నారు. అసలు ఆమెకే క్లారిటీ లేదు.. కేవలం రాజ్ తరుణ్ కావాలని మాత్రమే కేసు పెట్టింది.. గతంలో వివాహమైందని చెబుతోంది కానీ మళ్ళీ ఇప్పుడు పెళ్లి చేసుకోలేదని కేసు పెట్టావు.. ఒకవేళ రాజ్ తరుణ్ ను అంతగా ప్రేమిస్తే మరొక వ్యక్తితో ఎలా ఉన్నావు అంటూ ఆమె తెలియజేసింది.. ఇదేం బొమ్మలాట పెళ్లి కాదు కదా.. రాజ్ తరుణ్ మానసికంగా ఆమెను భరించలేక ఇలా చేస్తున్నారేమో అని తెలుపుతోంది.

- Advertisement -

ఇష్టం లేని వాళ్ళకి దూరంగా ఉండటమే మంచిది..

రాజ్ తరుణ్ కోసం న్యాయపోరాటం చేస్తా, సూసైడ్ చేసుకుంటానని చెప్పినప్పటికీ.. తను చేసుకోను అంటే ఏం చేయలేము కదా.. అన్నిటినీ కూడా వదులుకొని ముందుకు వెళ్లాలి. వద్దు అనుకున్న బంధం వదిలేస్తేనే మేలని.. ఇది తన అభిప్రాయంగా తెలియజేసింది మిర్చి మాధవి.. ఎంతో అన్యోన్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న బంధాలే నిలబడడం లేదు.. మరి ఇలాంటి బంధాలు నిలబడతాయా అంటూ ప్రశ్నిస్తోంది.. ఒకవేళ నీ దగ్గర డబ్బులు తీసుకుంటే నువ్వు అడిగి తీసుకో.. ఇలాంటి విషయాలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటూ ఆమె తెలియజేసింది. మొత్తానికి అయితే రాజు తరుణ్ లావణ్య బంధం పై మిర్చి మాధవి చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు