Raj Tarun – Lavanya: రాజ్ తరుణ్ ఎఫైర్ లిస్ట్ లో ఇంతమందా.. రోజుకు రూ.50వేలు అంటూ..?

Raj Tarun – Lavanya.. ప్రముఖ తెలుగు హీరో రాజ్ తరుణ్.. ఆయన ప్రేయసి లావణ్య గత వారం రోజులుగా వాదోప వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య.. రాజ్ తరుణ్ తనకు కావాలి అని.. ఇప్పటికీ అతడిని ప్రేమిస్తున్నాను అంటూ మీడియా ముందు చాలా బోల్డ్ గా చెప్పుకొచ్చింది.. రాజ్ తరుణ్ తో ఆడియో కాల్స్ మొదలుకొని… చాటింగ్ కి సంబంధించిన అన్ని ఎవిడెన్స్ ను ఈమె బయటపెడుతోంది. ఇక లావణ్య సేకరిస్తున్న ఆధారాలను బట్టి చూస్తే రాజ్ తరుణ్ కి మరో 10 సంవత్సరాలు జైలుశిక్ష ఖాయం అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే లావణ్య తో దాదాపు 11 సంవత్సరాల కు పైగా రాజ్ తరుణ్ సహజీవనం చేశారు.. శారీరకంగా సంబంధం ఉన్న మాట కూడా వాస్తవమేనని ఇటీవలే రాజు తరుణ్ కూడా మీడియా ముందు ఒప్పుకున్నారు.. అయితే కొందరి వల్ల రాజ్ తరుణ్ తనను పట్టించుకోవడం లేదని .. పైగా నేను గర్భవతినైతే అబార్షన్ కూడా చేయించాడు అని ఆరోపిస్తోంది లావణ్య. అంతేకాదు రాజ్ తరుణ్ ఎఫైర్స్ లిస్టులో చాలామంది హీరోయిన్స్ ఉన్నారు అంటూ బట్టబయలు చేసింది.

Raj Tarun - Lavanya: Is this much in Raj Tarun's affair list?
Raj Tarun – Lavanya: Is this much in Raj Tarun’s affair list?

రాజ్ తరుణ్ ఎఫైర్ లిస్టును బట్టబయలు చేసిన లావణ్య..

లావణ్య.. రాజ్ తరుణ్ ఎఫైర్ లిస్ట్ కి సంబంధించి చేసిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.. లావణ్య మీడియా ముందుకొచ్చి కొంతమంది హీరోయిన్లతో ఎఫైర్ పెట్టుకోవడం వల్లే నన్ను దూరం చేస్తున్నాడు అంటూ తెలిపింది.. అంతేకాదు ఆ హీరోయిన్ల పేర్లు కూడా చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.. మొదట మాల్వి మల్హోత్రా పేరు చెప్పుకొచ్చిన లావణ్య.. షాలిని పాండే, రిద్దీ కుమార్ వంటి హీరోయిన్లతో పాటు యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టి.. బిగ్ బాస్ సీజన్ ఫోర్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని.. తన నటనతో గ్లామర్ షో తో ప్రేక్షకులను ఆకట్టుకున్న అరియానా గ్లోరీ తో కూడా రాజ్ తరుణ్ ఎఫైర్ లిస్టులో ఉంది అంటూ హాట్ బాంబు పేల్చింది ఈ ముద్దుగుమ్మ..

రోజుకు రూ.50 వేలు అంటూ

మీడియా సమావేశంలో భాగంగా అరియానా తో రాజ్ తరుణ్ ఎఫైర్ పెట్టుకున్నట్లు మీకు ఎలా తెలిసిందని..? యాంకర్ ప్రశ్నించగా.. లావణ్య మాట్లాడుతూ… అరియానాతో ఎఫైర్ మొదలయ్యాక ..రాజ్ ఇంటికి వచ్చేవాడు కాదు.. ఆమె నాతో ప్రవర్తించే విధానం కూడా మారిపోయింది ..ఒక అమ్మాయి ఏం చేస్తుందో మరో అమ్మాయిగా నాకు అర్థం అయింది.. మణికొండలో అరియానా ఉంటున్న అపార్ట్మెంట్ కి రాజ్ వెళ్లేవాడు.. ఇక ఆ అపార్ట్మెంట్లోని వారు నాకు ఫోన్ చేసి చెప్పడమే కాదు వాళ్ళిద్దరి ఫోటోలు కూడా షేర్ చేశారు.. ఒకరోజు నేను గోవాలో ఉండగా రాజ్ ఫోన్ నుంచి అరియానా కాల్ చేసింది.. చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడింది.. నీకు జీతం ఎంత వస్తుంది. ? అని అడిగితే .. బిగినింగ్ కదా తక్కువ వస్తుంది అని చెప్పాను.. అవునా ..నాకైతే రోజుకు రూ.50 వేల నుంచి రూ.1లక్ష వరకు వస్తుంది అంటూ తక్కువ చేసి మాట్లాడింది .. అప్పుడే నాకర్థమైంది నాకు కౌంటర్ ఇవ్వడానికి అరియానాను రాజ్ వాడుకున్నాడు అని.. తర్వాత నేను అరియానాకు వార్నింగ్ ఇస్తే.. ఆమె నాకు సారీ కూడా చెప్పింది ..అందుకు సంబంధించిన కాల్ రికార్డ్స్ కూడా నా వద్ద ఉన్నాయి అంటూ షాక్ ఇచ్చింది లావణ్య. ప్రస్తుతం లావణ్య తీసుకొస్తున్న ఆధారాలను చూస్తుంటే రాజ్ తరుణ్ దోషి అని.. ఇక అన్ని ఆధారాలు లభ్యమయితే ఈయన జైలుకు వెళ్లాల్సిందే అని లావణ్య లాయర్ కూడా స్పష్టం చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు