Raj Tarun – Lavanya: రాజ్ తరుణ్ వద్దంటూ బాంబు పేల్చిన లావణ్య.. ఊహించలేదుగా..?

Raj Tarun – Lavanya: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా రాజ్ తరుణ్ – లావణ్య ఊహించని రేంజ్ లో ట్విస్ట్ లు ఇస్తున్న విషయం తెలిసిందే. మొదట రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకున్నాడని చెప్పిన లావణ్య ఏకంగా అబార్షన్ చేయించాడు అంటూ చెప్పింది. అంతేకాదు మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకున్నాడని, ఆమె వల్లే తనను విడిచిపెట్టాడంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చింది. దీనిపై స్పందించిన మాల్వి మల్హోత్రా ఈమె క్రిమినల్స్ తో తిరుగుతోందని, ఈమె కూడా క్రిమినల్ అంటూ తెలిపింది. మరొకవైపు రాజ్ తరుణ్ స్పందిస్తూ లావణ్యతో రిలేషన్ లో ఉన్నది నిజమే కానీ పెళ్లి చేసుకోలేదు. ఆమె డ్రగ్స్ తీసుకుంటుంది జైలుకెళ్ళి వచ్చింది. అందుకే ఆమెకు దూరంగా ఉన్నాను అంటూ తెలిపాడు. ఇలా రోజుకొకరు భారీ ట్విస్ట్ ఇస్తూ అభిమానులకు ఊహించని షాక్ ఇస్తున్నారని చెప్పవచ్చు.

Raj Tarun - Lavanya: Lavanya who bombarded Raj Tarun without expecting it..?
Raj Tarun – Lavanya: Lavanya who bombarded Raj Tarun without expecting it..?

రాజ్ తరుణ్ వద్దంటున్న లావణ్య..

రాజ్ తరుణ్ తనకు కావాలి అని, ఎలాగైనా సరే రాజ్ తరుణ్ ను మాల్వి మల్హోత్రా నుంచి దూరం చేయాలని పోలీస్ స్టేషన్ ముందు కోరిన లావణ్య , తాజాగా ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. రాజ్ తరుణ్ తనకు వద్దు అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. తాజాగా లావణ్య మాట్లాడుతూ.. ఇన్ని రోజులు నాలుగు గోడల మధ్య జరిగిన గొడవను నేను బయటకు తీసుకొచ్చాను. ఎందుకంటే నాకు కనీసం సహాయం దొరుకుతుందని అనుకున్నాను. అయితే రాజ్ తరుణ్ గురించి నేను ఎక్కడా కూడా చెడుగా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు అతడు నాతో ఎలాంటి సంబంధం లేదు అంటున్నాడు పెళ్లి చేసుకోలేదు అని కూడా చెబుతున్నాడు. మరి ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత నేను కూడా అతడిని వద్దనే అనుకుంటున్నాను..

అసలు కారణం ఇదే..

అయితే ఇన్ని రోజులు నాతో కలిసి ఉన్న తర్వాత నన్ను ఇలా బ్లేమ్ చేస్తూ కామెంట్లు చేస్తున్నాడు.. అతని కోసం నేను ఎంతో పోరాడాను. కానీ ఇప్పుడు వద్దని అనుకుంటున్నాను అంటూ తెలియజేసింది లావణ్య. అలాగే ఒక అమ్మాయితో పెళ్లి చేసుకోకుండా ఇన్ని రోజులు ఉండడం అంటే అత్యాచారం కిందికే వస్తుంది. అతను ఆ సెక్షన్ కి కట్టుబడి ఉండాలి అని నేను అనుకుంటున్నాను. శేఖర్ బాషాతో రాజ్ తరుణ్ నాపై చేయించిన ఆరోపణలు కూడా నన్ను మరింత బాధ కలిగిస్తున్నాయి శేఖర్ చేసిన ఆరోపణలవల్ల రాజ్ తరుణ్ కూడా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది.వాళ్ల ఇంటికి వెళ్తే నాపై తప్పుడు కేసులు పెట్టారు.

- Advertisement -

ఫోటోకి దండేసి బ్రతికేస్తా..

నేను ఒక క్లారిటీ కోసం వెళ్తే వారేమో చంపేయడానికి వచ్చిందని తెలిపారు. అతడితో దాదాపు 11 ఏళ్లున్నాను. అందుకే ఒక సమాధానం కోసం వాళ్ళ ఇంటికి వెళ్లాను. దానికి బదులుగా న్యూసెన్స్ కేసు పెట్టారు. ఫైనల్ గా నేను కోరుకునేది ఏంటి అంటే రాజ్ తరుణ్ నాతో 11 ఏళ్లు ఉన్నాడు. కాబట్టి అతడిని నేను కావాలని కోరుకున్నాను.కానీ అతడే ఇప్పుడు నన్ను వద్దనుకున్నప్పుడు నేను కూడా బలవంతంగా అతడిని నా దగ్గరకు తీసుకురాలేను కదా.. అతడు నా జీవితంలో లేడు అనుకోని అతడి ఫోటోకి దండేసి బ్రతికేస్తాను కానీ నాకు మాత్రం న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అంటూ లావణ్య తెలిపింది. మొత్తానికి అయితే లావణ్య చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు