Raj Tarun – Lavanya: రాజ్ తరుణ్ అబార్షన్ చేయించాడు.. ఆధారాలతో సహా.. కేస్ ఫైల్..!

Raj Tarun – Lavanya: ప్రముఖ టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ గత వారం రోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తనను ప్రేమించి.. గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకొని.. ఇప్పుడు ప్రముఖ హీరోయిన్ మాల్వీ మల్హోత్రా దొరకడంతో తనను వదిలేశాడు అంటూ లావణ్య అలియాస్ అన్విక అనే ఒక యువతీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది.. ఆరోజు నుంచి పలువురు హీరోయిన్లతో ఎఫైర్ ఉందంటూ రాజ్ తరుణ్ గుర్తు రట్టు చేసే ప్రయత్నం చేసింది.. ముఖ్యంగా రిద్ది కుమార్, అరియానా గ్లోరీ , మాల్వి మల్హోత్రా వంటి హీరోయిన్లతో ఇతడికి ఎఫైర్ ఉందని కామెంట్లు చేసింది లావణ్య..

Raj Tarun - Lavanya: Raj Tarun Abortion.. With Evidence.. Case File..!
Raj Tarun – Lavanya: Raj Tarun Abortion.. With Evidence.. Case File..!

లావణ్య పై రాజ్ తరుణ్ కామెంట్..

అంతేకాదు రాజ్ తరుణ్ – మాల్వి మల్హోత్రా రిలేషన్ గురించి చెబుతూ రాజ్ తరుణ్ ను వదిలేయాలని.. లేకపోతే చంపేస్తామని.. మాల్వి మల్హోత్రా ఆమె సోదరుడు బెదిరిస్తున్నారు అంటూ కూడా తెలిపింది. అయితే అదే రోజు రాజ్ తరుణ్ మీడియా ముందుకు వచ్చి తనతో రిలేషన్ లో ఉన్న మాట వాస్తవమే.. కానీ ఆమె ప్రతిరోజు డ్రగ్స్ తీసుకుంటుంది.. ఈ కేసులో భాగంగా 45 రోజులు జైలుకు వెళ్లొచ్చింది. ఇక మాల్వి తో తనకు ఎటువంటి సంబంధం లేదు.. లావణ్య ఇంకొకరితో ఎఫైర్ పెట్టుకోవడం వల్లే మూడేళ్ల నుంచి ఆమెకు దూరంగా ఉంటున్నాను అంటూ రాజ్ తరుణ్ తెలిపాడు.

పోలీసులను ఆశ్రయించిన మాల్వి..

మాల్వీ కూడా మీడియా ముందుకు వచ్చి.. నా సామిరంగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే రాజ్ తరుణ్ తో ఫోన్ కాంటాక్ట్ లో ఉన్నానని.. కావాలని లావణ్య తనను ఈ విషయంలోకి లాగుతోంది దయచేసి యాక్షన్ తీసుకోవాలని పోలీసులను కోరింది.

- Advertisement -

పోలీసుల నోటీసులు.. ట్విస్ట్ ఇచ్చిన లావణ్య..

వాదోపవాదనలు విన్న తర్వాత ఆధారాలను సమర్పించాలని నార్సింగి పోలీసులు లావణ్యకు నోటీసులు జారీ చేశారు.. దీంతో కొద్దిరోజులు ఈమె మీడియా ముందు కనిపించలేదు.. ఇక ఈమె పరారీలో ఉందని..ఈమె చెప్పేదంతా అబద్ధాలు అంటూ రాజ్ తరుణ్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ వార్తలు వైరల్ చేశారు.. అయితే అనుకోకుండా లావణ్య ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.. ఆధారాలతో సహా బట్టబయలు చేసింది.. తనను గర్భవతిని చేసి అబార్షన్ చేయించాడని.. అందుకు సంబంధించిన సాక్షాలను కూడా చూపించింది లావణ్య.

ఆధారాలతో గుట్టు రట్టు..

ముఖ్యంగా మాల్వీ వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ తనను దూరం పెట్టాడని.. మాల్వి కోసం ముంబైకి వెళ్లడంతో తాను ప్రశ్నించాను.. అప్పటినుంచి తనను దూరం పెట్టాడని తెలిపిన లావణ్య.. ఈ ఫిర్యాదుతో పాటు కొన్ని స్క్రీన్ షాట్ లు, మరికొన్ని ఆధారాలను, అబార్షన్ చేయించిన మెడికల్ డాక్యుమెంట్స్, ఆసుపత్రి వివరాలు అన్నింటిని కూడా ఆమె పోలీసులకు సమర్పించింది. దీంతో రాజ్ తరుణ్ పై నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.. కనుక అబార్షన్ చేయించాడని లావణ్య మెడికల్ రిపోర్టులు, 170 ఫోటోలు, టెక్నికల్ ఎవిడెన్స్ ను పోలీసులకు అందజేసింది..

రాజ్ తరుణ్ పై కేస్ ఫైల్..

దీంతో పోలీసులు రాజ్ తరుణ్ పై ఐపిసి సెక్షన్ 493 తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. త్వరలోనే అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఇక ప్రస్తుతం ఈ వార్త చాలా వైరల్ గా మారుతుంది. మరి దీనిపై రాజ్ తరుణ్ మళ్లీ మీడియా ముందుకు వస్తారా..? ఇక డైరెక్ట్ జైలుకేనా అంటూ నేటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ కథ ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు