Raj Tarun – Lavanya: రాజ్ తరుణ్ తో రిలేషన్.. షాకింగ్ కామెంట్స్ చేసిన లావణ్య తండ్రి..!

Raj Tarun – Lavanya.. టాలీవుడ్ లో గత ఐదు రోజుల నుంచి ఎక్కువగా నడుస్తున్న వ్యవహారం ఏమిటంటే రాజ్ తరుణ్, లావణ్య ల ఎఫైర్ ..ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు కేవలం లావణ్య మాత్రమే తన మనసులో మాటలను తెలియజేయడం జరిగింది. హీరో రాజ్ తరుణ్ మాత్రం కేవలం ఒక్కసారి మాత్రమే మీడియా ముందుకు వచ్చి తాను చెప్పినవన్నీ అబద్ధాలు అని.. డబ్బుల కోసమే లావణ్య ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తోంది అనే విధంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి రాజ్ తరుణ్. కానీ ఇప్పుడు తాజాగా లావణ్య తల్లిదండ్రులు కూడా మీడియాను ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది.మరి వారు ఏ విధమైన కామెంట్లు చేశారో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం..

Raj Tarun - Lavanya: Relationship with Raj Tarun.. Lavanya's father made shocking comments..!
Raj Tarun – Lavanya: Relationship with Raj Tarun.. Lavanya’s father made shocking comments..!

ఎంత డబ్బైనా పర్లేదు – లావణ్య తండ్రి

తాజాగా లావణ్య తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చి.. బయట చెప్పుకోలేని సంఘటనలు జరిగాయి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.. రాజ్ తరుణ్ కు లావణ్య ఎన్నో డబ్బులు ఇచ్చి తనకి సపోర్టుగా నిలిచింది అంటూ లావణ్య తండ్రి తెలిపారు.. అతను గత పదేళ్లుగా తమ కుటుంబానికి తెలుసు అని, తమ కూతురు చెప్పడం వల్లే అతడిని నమ్మామంటూ తెలిపారు.. కానీ నమ్మిన వాళ్లే ఇలా అన్యాయం చేస్తారా అంటూ లావణ్య తండ్రి ఎమోషనల్ గా మాట్లాడారు. కేవలం రాజ్ తరుణ్ ను తన కూతురు లావణ్య ను కలపాలనే ఆలోచన తప్ప.. మరే ఉద్దేశం తమకు లేదు అంటూ తెలిపారు. ఎంత డబ్బైనా పర్లేదు.. ఆస్తులు అమ్ముకోనైనా సరే రాజ్ తరుణ్ , లావణ్యలను కలపడానికి ప్రయత్నం చేస్తాము అంటూ కూడా లావణ్య తండ్రి తెలిపారు.

వారంలో ఒక్కసారైనా వారి కుటుంబంతో కలిసేవారం..

గతంలో కూడా రాజ్ తరుణ్ కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉండేవారు అని, ఇప్పుడు ఫోన్ చేసినా కూడా కలవడం లేదు.. గతంలో వారంలో కనీసం ఒకసారైనా వారి ఇంటికి వెళుతూ ఉండేవారేమని.. గడిచిన మూడు నెలల నుంచి రాజు తరుణ్ తల్లిదండ్రులకు మా కుటుంబానికి ఎలాంటి మాటలు లేవు.. తన కూతురు లావణ్య కు డ్రగ్స్ అలవాటే లేదని కేవలం రాజ్ తరుణ్ అంతా అబద్ధమే చెబుతున్నారు అంటూ ఆమె తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు. చాక్లెట్లు కూడా సరిగ్గా తినలేని అమ్మాయిని కూడా డ్రగ్స్ తీసుకున్నారని రాజ్ తరుణ్ ఎలా అబద్ధం చెప్పారో తెలియదు అంటు మాట్లాడారు లావణ్య తండ్రి.

- Advertisement -

పట్టరానంత కోపం..

ఇలాంటి వార్తలు సృష్టించిన ఆ మూర్ఖుడిని ఎదురుగా ఉంటే కొట్టాలనేంత కోపంగా ఉన్నదంటూ తెలిపారు.. కానీ వారిద్దరూ మాత్రం ఒక్కటైతే చాలు.. తన కూతురు అతనితోనే కలిసి జీవించాలి అనుకుంటుంది.. అందుకే వారికి సహకరిస్తున్నామంటూ లావణ్య తండ్రి తెలిపారు.. తన కూతురికి ఎన్నో బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి.. తనకు ఏమైనా జరిగిందంటే ఊరుకునేది లేదు.. ఆమెకు కచ్చితంగా న్యాయం జరగాలి అంటూ తెలియజేశారు. రాజ్ తరుణ్ నటుడు కాక ముందు నుంచే లావణ్యతో రిలేషన్ లో ఉన్నారని కూడా తెలిపారు.

లావణ్య కు న్యాయం జరగాలి..

కానీ ఇప్పుడు సాధారణ అమ్మాయిగా తనకు న్యాయం కావాలని ఆమె కోర్టు మెట్లు ఎక్కడ జరిగింది.. రాజ్ తరుణ్ తనకి ఇక దక్కడని.. ఈ పరిస్థితి తను గమనించి ఉంది కాబట్టే ఇలా చట్ట పరంగా ముందుకు వెళుతోంది అంటూ లావణ్య తండ్రి తెలియజేశారు. ప్రస్తుతం లావణ్య తండ్రి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు