Raj Tarun – Lavanya : రాజ్ తరుణ్ కేసులో ఊహించని ట్విస్ట్… పరారీలో లావణ్య..!

Raj Tarun – Lavanya: నిన్న రాజ్ తరుణ్ తనను మోసం చేశాడు అంటూ ప్రముఖ మ్యూజీషియన్ లావణ్య మీడియా ముందుకు వచ్చి చెప్పడమే కాదు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చిన విషయం సంచలనం సృష్టించింది.. అయితే తాజాగా ఈమెకు పోలీసులు రివర్స్లో షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నార్సింగి పోలీసులు తాజాగా లావణ్య కు నోటీసులు జారీ చేశారు.. అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని ఆమెకు 91 సీఆర్పీసీ కింద నోటీసులు పంపడం జరిగింది.. అయితే ప్రస్తుతం ఆమె అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆమె ఆరోపణల్లో నిజం లేదని.. హీరో రాజ్ తరుణ్ నిన్న స్పందించారు.. తనను చాలా టార్చర్ చేసిందని మీడియాతో చెప్పారు.. ఇక ఇప్పుడు ఈమె పరారీలో ఉండడంతో ఈమె చెప్పిందంతా అబద్ధమే అంటూ అభిమానులు , నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.. మరి నిజా నిజాలు తెలియాలి అంటూ లావణ్య పూర్తి ఆధారాలను పోలీసుల ముందు పెట్టాల్సిందే.

Raj Tarun - Lavanya : Unexpected twist in Raj Tarun's case... Lavanya on the run..!
Raj Tarun – Lavanya : Unexpected twist in Raj Tarun’s case… Lavanya on the run..!

అసలు ఏం జరిగిందనే విషయానికి వస్తే..

నిన్న లావణ్య రాజ్ తరుణ్ తనను మోసం చేశాడు అంటూ తెలిపింది.. ఉయ్యాల జంపాల సినిమాతో 2013లో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు .. కానీ అంతకుముందే షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన విషయం తెలిసిందే.. అదే సమయంలోనే లావణ్యతో పరిచయం ఏర్పడి.. దాదాపు 11 సంవత్సరాల పాటు ప్రేమించుకున్నామని.. లావణ్య తెలిపింది.. అయితే ఒక గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నామని.. జీవితాంతం తనతోనే ఉంటానని చెప్పి.. ఇప్పుడు ఇంకొక హీరోయిన్ మాన్వి తో రిలేషన్ లో ఉన్నాడు అని.. ఆమె వల్లే తనను వదిలేశాడు అంటూ ఆరోపించింది.. అంతేకాదు దయచేసి నీ కాళ్లు పట్టుకుంటాను.. రాజ్ తరుణ్ ను వదిలేయ్ అంటూ మాన్విని ఈమె బ్రతిమలాడుకున్న ఆడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఇక దీంతో అందరూ రాజ్ తరుణ్ దే తప్పు అంటూ చాలామంది రకరకాల కామెంట్లు చేశారు.

రాజ్ తరుణ్ స్పందన..

అయితే నిన్న సాయంత్రమే రాజ్ తరుణ్ కూడా ఈ విషయంపై స్పందించారు.. రాజ్ తరుణ్ మాట్లాడుతూ ఆమెతో ప్రేమలో ఉన్న విషయం నిజమే.. కానీ ఆమె ఇంకొకరితో ఎఫైర్ పెట్టుకుంది.. ఆమె నన్ను చాలా టార్చర్ చేసేది.. డ్రగ్ కేసులో కూడా 45 రోజులపాటు జైలులో ఉండొచ్చింది అంటూ ఆమె అసలు రూపాన్ని బయటపెట్టారు.

- Advertisement -

పరారీ లో లావణ్య..

ఇద్దరి వాదనలు విన్న పోలీసులు.. అసలు నిజం తెలుసుకొని లావణ్య కు నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె పరారీలో ఉంది.. పూర్తి ఆధారాలను చూపించాలని.. అప్పుడే రాజ్ తరుణ్ పై యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందని కూడా స్పష్టం చేసినట్లు సమాచారం. ఇకపోతే తాను డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నానని ఆమె స్పష్టం చేసింది.. మరి ఈమె చెప్పింది అంతా అబద్ధమేనని పబ్లిసిటీ కోసం రాజ్ తరుణ్ కెరీర్ ను నాశనం చేయడానికి ఇలాంటి కామెంట్లు చేసిందని.. రాజ్ తరుణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు