Raj Tarun: రోజు రోజుకూ రాజ్ తరుణ్ గుట్టు విప్పుతున్న లావణ్య.. అరియానా కూడా..?

Raj Tarun.. ప్రస్తుతం రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య.. హీరో గారి బాగోతాల చిట్టా రోజుకొకటి చొప్పున విప్పుతూ..వార్తల్లో నిలిచేలా చేస్తోంది. గత రెండు మూడు రోజులుగా రాజ్ తరుణ్ వార్తల్లో నిలుస్తున్నారు అనే చెప్పాలి. అసలు విషయంలోకి వెళ్తే రాజ్ తరుణ్.. 11 ఏళ్ల క్రితమే తనను పెళ్లి చేసుకున్నాడని.. జీవితాంతం తోడు ఉంటానని చెప్పి తనను కాదని ప్రముఖ హీరోయిన్ మాన్వి మల్హోత్రాతో చట్టపట్టలేసుకొని తిరుగుతూ.. ఆమెతో ఎఫైర్ నడుపుతున్నాడని ఆరోపణలు చేసింది రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య. అంతే కాదు ఏకంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ కంప్లైంట్ కూడా చేసింది. దీంతో రాజ్ తరుణ్ పేరు ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది.

Raj Tarun: Lavanya, who is opening up Raj Tarun day by day.. Ariana too..?
Raj Tarun: Lavanya, who is opening up Raj Tarun day by day.. Ariana too..?

లావణ్య మాటలకు క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్..

అయితే ఈ విషయంపై రాజ్ తరుణ్ స్పందిస్తూ.. లావణ్యతో రిలేషన్ ఉన్న మాట వాస్తవమే.. కానీ ఆమెను పెళ్లి చేసుకోలేదు.. అయితే ఆమె డ్రగ్స్ కు అలవాటు పడింది.. ఇంకొకరితో ఎఫైర్ పెట్టుకుంది.. 45 రోజులు జైల్లో కూడా ఉండొచ్చింది.. అందుకే దాదాపు మూడు సంవత్సరాల క్రితమే ఆమెతో బ్రేకప్ చేసుకున్నాను అంటూ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు మాన్వి మల్హోత్రాతో ఉన్న రిలేషన్ పై కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది.. ఆమె తనకు స్నేహితురాలు మాత్రమేనని.. లావణ్య కావాలని ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తోందని చెప్పారు.

స్పందించిన మాన్వి మల్హోత్రా..

మాన్వి మల్హోత్రా కూడా ఈ విషయంపై స్పందించింది మాన్వి మల్హోత్రా మాట్లాడుతూ.. నా సామిరంగా సినిమా ప్రమోషన్స్ కోసం మాత్రమే నేను రాజ్ తరుణ్ తో మాట్లాడాను.. ఎనిమిది నెలల నుంచి ఆయనతో నాకు ఎటువంటి కాంటాక్ట్ లేదు.. పైగా నేను, మా సోదరుడు ఆమెను చంపేస్తామని బెదిరిస్తున్నామని.. ఆమె చెబుతోంది… అటువంటివేవీ చేయలేదు.. వారిద్దరి గొడవల్లో మమ్మల్నిలాగే ప్రయత్నాలు చేస్తొంది. మాకు పరువు నష్టం కలిగించే ప్రయత్నాలు చేస్తోంది. ఆమెపై చర్యలు తీసుకోవాలని ఈమె కూడా లావణ్య పై ఆరోపణలు చేస్తూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది..

- Advertisement -

లావణ్య కు నోటీసులు..

దీంతో పోలీసులు లావణ్య కు నోటీసులు జారీ చేశారు.. సరైన ఆధారాలను పోలీసులకు అప్పగించాలని కోరారు.. కానీ ఆమె ప్రస్తుతం కనబడడం లేదని…పరారీలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

మాన్వీ మాత్రమే కాదు అరియానా, రిద్దీ తో కూడా ఎఫైర్..

అయితే ఇంతలోనే ఇప్పుడు మరోసారి మీడియా ముందుకు వచ్చి తీవ్ర విమర్శలు చేసింది లావణ్య.. నిన్నటి వరకు రాజ్ తరుణ్ కు హీరోయిన్ మాన్వీ తో అక్రమ సంబంధం ఉందని.. మాన్వీ తో కలిసి చెన్నైలో ఒక హోటల్లో ఉన్నాడని చెప్పిన ఈమె.. ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ అరియానా, లవర్స్ మూవీ హీరోయిన్ రిద్దీ తో కూడా అక్రమ సంబంధం ఉంది అని ఆరోపిస్తోంది. తనకు డ్రగ్స్ కేసుతో ఎటువంటి సంబంధం లేదని.. మస్తాన్ సాయి తనకు స్నేహితుడు మాత్రమేనని ఈమె చెప్పుకొచ్చింది.. అయితే ఇప్పుడు నిన్నటి వరకు ఒక హీరోయిన్ పేరు చెప్పి ఇప్పుడు మరో ఇద్దరి పేర్లు చెప్పేసరికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. రాజ్ తరుణ్ నిజంగా ఇలాంటి వాడా.. అంటూ తెగ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. మరి నిజానిజాలు తెలియాలి అంటే పూర్తి విషయాలు బయటకు వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు