Purushothamudu : ఏమయ్యా రాజ్ తరుణ్ .. వ్యక్తి పేరులో రాముడు ఉండటంకాదు .. వ్యక్తిత్వంలో రాముడు ఉండాలి..

Purushothamudu : తెలుగు ప్రేక్షకుల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మంచి సినిమాని మంచి నటుడిని తెలుగు ప్రేక్షకులు ఆదరించినంతగా ఇంకే ఇండస్ట్రీ ప్రేక్షకులు ఆదరించరు. ఒక సినిమా రిలీజ్ అని కూడా ఒక పండగ సెలబ్రేట్ చేసుకోవటం కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. అలానే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన ఎంతోమందికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఒక మంచి సినిమాతో ఎవరు ముందుకు వచ్చినా కూడా వాళ్ళని ఆదరిస్తారు. అలా చిన్న సినిమాలు గా వచ్చిన ఎన్నో సినిమాలకు ప్రేక్షకులు మంచి కలెక్షన్స్ ఇచ్చారు.

ఇకపోతే షార్ట్ ఫిలిం తో కెరియర్ మొదలుపెట్టి ఉయ్యాల జంపాల అనే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రాజ్ తరుణ్. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ ను సాధించి రాజ్ తరుణ్ ఒక హీరోగా నిలబెట్టింది. సక్సెస్ పడగానే చాలామంది చుట్టూ చేరిపోతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలానే రాజ్ తరుణ్ కి మొదటి హిట్ పడగానే చాలా ప్రొడక్షన్ హౌసెస్ నుంచి మంచి మంచి ఆఫర్స్ వచ్చాయి. వాటిలో కొన్ని సినిమాలకు రాజ్ తరుణ్ సైన్ కూడా చేశాడు. అయితే రాజ్ తరుణ్ కెరియర్ మొదట్లో మంచి సినిమాలను ఎంచుకుంటూ ముందుకు వచ్చాడు. రాజ్ తరుణ్ కెరియర్ లో సినిమా చూపిస్త మామ, కుమారి 21f లాంటి సినిమాలు మంచి ప్లస్ అయ్యాయి.

వివాదాలు కూడా అదే స్థాయిలో

అయితే రాజ్ తరుణ్ పై వివాదాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఒక సందర్భంలో తాగి కార్ డ్రైవ్ చేసి ఒక యాక్సిడెంట్ కి పాల్పడి కారును రాత్రి అక్కడే వదిలేసి వెళ్లిపోవడం కూడా జరిగింది. అలానే రాజ్ తరుణ్ ప్రొఫెషనల్ కెరియర్ కూడా సన్నగిల్లుతూ వచ్చింది. అవకాశాలు తగ్గడం మొదలయ్యాయి. అయితే ఎప్పుడో చేసిన పురుషోత్తముడు అనే సినిమా ట్రైలర్ రీసెంట్గా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. వాస్తవానికి ఆ ట్రైలర్ చూస్తేనే తెలిసిపోతుంది ఇది ఇప్పుడు సినిమా కాదు అని. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకి పెద్దగా ఏం లేవు. ఏదో టైం పాస్ కి రిలీజ్ చేస్తున్నట్లు అనిపించక మానదు.

- Advertisement -

Raj Tarun

ఇకపోతే రీసెంట్ గా రాజ్ తరుణ్ పై ఉన్న కేసుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరియర్ స్టార్టింగ్ లో లావణ్య అనే ఒక అమ్మాయి తో రిలేషన్షిప్ కి వెళ్లి ఆ తర్వాత ఒక హీరోయిన్ తో ప్రేమాయణం సాగించాడు అని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ తరుణంలోని రాజ్ తరుణ్ వ్యక్తిత్వం గురించి కూడా చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ సందర్భంలో పురుషోత్తముడు సినిమా ట్రైలర్ రిలీజ్ అవడంతో చాలామంది సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఏమయ్యా రాజ్ తరుణ్ .. వ్యక్తి పేరు లో రాముడు ఉండటంకాదు .. వ్యక్తిత్వంలో రాముడు ఉండాలి.. సినిమాలోని డైలాగులు రియల్ లైఫ్ కి అటాచ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు