Raj Tarun : క్షమించండి.. అవమానంగా ఉంది.. ఆమెకు క్షమాపణ చెప్పిన హీరో..!

Raj Tarun : టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) ఈ మధ్య తన సినిమాల కంటే వ్యక్తిగత కారణాల వల్ల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తనను ప్రేమించి, పెళ్లి చేసుకుని, గర్భవతిని చేసి, అబార్షన్ చేయించి ఇప్పుడు ఇంకొక అమ్మాయి ప్రేమలో ఉన్నాడని, తనను దూరం పెట్టాడని ఆయన ప్రేయసి లావణ్య చీటింగ్ కేసు పెట్టింది. దీంతో రాజ్ తరుణ్ పేరు సోషల్ మీడియాలో ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ హీరో పేరే వినిపిస్తూ ఉండడం గమనార్హం.

Raj Tarun: Sorry.. It's a shame.. The hero who apologized to her..!
Raj Tarun: Sorry.. It’s a shame.. The hero who apologized to her..!

మాల్వి మల్హోత్రా ఇంట్లో గొడవకు దిగిన లావణ్య..

ఇదంతా ఇలా ఉంటే.. గత నెల రోజులుగా సైలెంట్ గా ఉన్న లావణ్య (Lavanya)… మాల్వి మల్హోత్రా (Malvi Malhotra) హిరోయిన్ ఇంట్లో రాజ్ తరుణ్ (Raj tarun) ఉన్న సమయంలో ఒక వీడియోని రిలీజ్ చేసింది.. అంతేకాదు రాజ్ తరుణ్‌పై లావణ్య దొంగతనం కేసు కూడా పెట్టింది. ఇక మాల్వి ఇంట్లో రాజ్ తరుణ్ వున్న విషయం తెలుసుకొని, ముంబై వెళ్ళిన లావణ్య.. మాల్వి ఇంట్లో గొడవకు దిగింది. లావణ్య గొడవ చేస్తున్న సమయంలో హీరో రాజ్ తరుణ్ కూడా అక్కడే ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. తాజాగా ఈ ఘటనపై రాజ్ తరుణ్ పోస్ట్ చేస్తూ ముంబైలో జరిగిన ఘటనకు హీరోయిన్ మాల్వీ కి క్షమాపణలు కూడా తెలియజేశారు.

మాల్వి మల్హోత్రాకు క్షమాపణలు చెప్పిన రాజ్ తరుణ్..

రాజ్ తరుణ్ తన పోస్ట్ లో.. “ముంబైలో జరిగిన ఆ సంఘటనను తలచుకొని నాకు చాలా బాధగా అనిపిస్తోంది. ఎంతో అవమానంగా అనిపించింది కూడా.. ఇలా మీ ఇంటి వద్ద జరిగినందుకు నన్ను క్షమించండి. అయినప్పటికీ మీతో, మీ స్నేహితులతో కలిసి నేను వినాయక చవితి పండుగను చాలా బాగా ఆస్వాదించాను. ఆ గణేషుడి ఆశీస్సులు ఎప్పటికీ మనందరికీ ఉంటాయి అంటూ మాల్వి మల్హోత్రాను ట్యాగ్ చేస్తూ ఆమెకు క్షమాపణలు తెలియజేశాడు రాజ్ తరుణ్.

- Advertisement -

రాజ్ తరుణ్ మూవీ..

అంతేకాదు మాల్వి ఇంట్లో గణేశుడుతో దిగిన ఫోటోని కూడా ఆయన పంచుకున్నారు. ఇదిలా ఉండగా రాజ్ తరుణ్ తాజాగా నటించిన చిత్రం భలే ఉన్నాడే. ఈరోజు ఆడియన్స్ ముందుకి రాబోతోంది. ఈ సినిమా ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకోగా.. మంచి విజయం సాధిస్తుందని అభిమానులు సైతం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాతో రాజు తరుణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

రాజ్ తరుణ్ కెరియర్..

ఇక రాజ్ తరుణ్ విషయానికి వస్తే.. ఒకప్పుడు షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ కెరియర్ మొదలుపెట్టిన ఈయన ఆ తర్వాత ఉయ్యాల జంపాల అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తర్వాత సినిమా చూపిస్త మామ ఇలా ఎన్నో సినిమాలలో నటించి మంచి పాపులారిటీ దక్కించుకున్నారు. కానీ టైర్ 2 హీరోగా పేరు సొంతం చేసుకోలేకపోయారు. ఇదిలా ఉండగా ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నా వ్యక్తిగత కారణాల వల్ల ఈయన నెగెటివిటీ ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు