Raja Saab : రాజా సాబ్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ సెలెబ్రేషన్స్ కు రెడీ అవండమ్మా..

Raja Saab : రెబల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గా కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది.. ఇక కలెక్షన్స్ విషయానికోస్తే బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసేంది. ఆ సినిమా వచ్చి నెల అయినా కాసుల వర్షం కురుస్తుంది.. ఇప్పుడు రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.. ఆ సినిమా పై అంచనాలు ఓ రేంజులో ఉన్నాయి. సరికొత్త లుక్ లో కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ సినిమాపై ఆసక్తి కనబరుస్తున్నారు.. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ రాబోతుందని మేకర్స్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.. సినిమా గ్లింప్స్ రాబోతున్నట్లు పోస్టర్ లో పేర్కొన్నారు.

ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా లేదంటే సమ్మర్ స్పెషల్ గా రాజా సాబ్ సినిమాని థియేటర్స్ లోకి తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.. ఈ సినిమా పై జనాల్లో అంచనాలను పెంచేందుకు మేకర్స్ వరుసగా అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నారు.. తాజాగా గ్లింప్స్ రాబోతున్నట్లు తెలుపుతూ పోస్టర్ ను టీమ్ రిలీజ్ చేశారు.. సోమవారం సాయంత్రం 5.03 నిమిషాలకు గ్లింప్స్ ను విడుదల చెయ్యనున్నట్లు ప్రకటించారు.

- Advertisement -

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ ఏకంగా 250 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మారుతి కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్, బిగ్ హీరో మూవీ ఇదే కావడం విశేషం. కంటెంట్ అండ్ టెక్నికల్ పరంగా మారుతి టాలెంట్ ఏంటో అందరికీ తెలిసిందే.. గతంలో మారుతి డైరెక్షన్స్ లో వచ్చిన సినిమాలు మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి.. రాజా సాబ్ నుంచి రాబోయే కంటెంట్ ఏదైనా కూడా భారీ లెవెల్ లోనే ఉండాలని కోరుకుంటున్నారు.. కల్కి సినిమాతో సాలిడ్ హిట్ ను సొంతం చేసుకున్న ప్రభాస్ ఈ సినిమాతో ఎలాంటి టాక్ ను అందుకుంటాడో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు