Rajamouli: నా భార్యను అలా చూసి తట్టుకోలేకపోయా.. జక్కన్న ఎమోషనల్ కామెంట్స్..!

Rajamouli.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో జక్కన్నగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని ఎల్లలు దాటించి మరింత ఇమేజ్ దక్కించుకున్నారు. తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమాలు చేసి రికార్డు క్రియేట్ చేసిన ఈయన బాహుబలి సినిమాతో ఒక్కసారిగా తెలుగు సినిమా గుర్తింపును దేశవ్యాప్తంగా మారుమ్రోగేలా చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలన్నీ కూడా బాహుబలి నుంచే మొదలయ్యాయి అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా రాజమౌళి టేకింగ్ సినిమాను వేరే స్థాయికి తీసుకెళ్తాయి. ఇక బాహుబలి తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా చేసి ఏకంగా ఆస్కార్ వేదికపై తెలుగు సినిమాను నిలబెట్టారు రాజమౌళి. హాలీవుడ్ దర్శకులు కూడా రాజమౌళి పనితనాన్ని మెచ్చుకొని ఆయన పై ప్రశంసలు కురిపించారు.

Rajamouli: Can't stand seeing my wife like that.. Jakkanna's emotional comments..!
Rajamouli: Can’t stand seeing my wife like that.. Jakkanna’s emotional comments..!

మోడ్రన్ మాస్టర్స్..

అయితే ఆయన సినీ కెరియర్ మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు జరిగిన ప్రతి విషయాన్ని కూడా నెట్ ఫ్లిక్స్ ఓటిటి డాక్యుమెంటరీ తయారు చేసిన విషయం తెలిసిందే. మోడ్రన్ మాస్టర్స్ అంటూ వచ్చిన ఈ డాక్యుమెంటరీలో ఎన్నో విషయాలు అభిమానులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా రాజమౌళి పై వచ్చిన ఈ డాక్యుమెంటరీ అందరినీ ఆకట్టుకోవడమే కాదు చాలామందికి రాజమౌళి గురించి తెలియని ఎన్నో విషయాలు తెలిసేలా చేస్తోంది.. అందులో భాగంగానే రాజమౌళి , రామ్ చరణ్ తో తెరకెక్కించిన మగధీర సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే మగధీర సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను రాజమౌళి పంచుకున్నారు.

రమాకి పక్షవాతం వచ్చింది అనుకున్నా – రాజమౌళి

రాజమౌళి మాట్లాడుతూ.. మగధీర సినిమా షూటింగ్ సమయంలో మాకు పెద్ద ఆక్సిడెంట్ జరిగింది. నేను నా భార్య రమా రాజమౌళి ఒక ఏరియాలో డ్రైవ్ చేస్తూ వస్తుంటే, అనుకోకుండా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. మా వాళ్ళందరికీ గాయాలయ్యాయి. నా భార్య రమా కి బాగా దెబ్బలు తగిలాయి. నడుము కింద స్పర్శ కూడా పోయింది. ఆమెకు పక్షవాతం వచ్చిందని అనుకున్నాము. దగ్గర్లో హాస్పిటల్ కూడా లేకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే తెలిసిన డాక్టర్స్ అందరికీ ఫోన్ చేశాను. నా భార్యని చూస్తూ వారికి ఫోన్ చేస్తూ ఏడ్చాను.అయితే దేవుడి దయతో ఆమెను హాస్పిటల్ లో చేర్చిన తర్వాత అమెరికావరీ అయింది అంటూ తెలిపారు రాజమౌళి. ప్రస్తుతం తన భార్య గురించి రాజమౌళీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా మగధీర సినిమా షూటింగ్స్ సమయంలో పెద్ద యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి, అందరిని ఆశ్చర్యపరిచారు రాజమౌళి.

- Advertisement -

రాజమౌళి సినిమాలు..

ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు హీరోగా ఒక సినిమా చేస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఈ సినిమా రాబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇక త్వరలోనే ఈ సినిమా సెట్ పైకి వెళ్లనుంది అని, అయితే ఈ సినిమా విడుదల కావడానికి మరో రెండు మూడేళ్ల సమయం పట్టొచ్చు అని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు