Rajamouli: బాల కృష్ణుడిగా జక్కన్న నటించిన మూవీ ఏంటో తెలుసా.. లుక్ అదుర్స్..!

Rajamouli.. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని దేశం నలుమూలలా వ్యాపింప చేసిన ఘనత దిగ్గజ దర్శకుడు రాజమౌళిది. ఈ సినిమా అందించిన గుర్తింపుతో విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించడానికి పూనుకున్నారు. ఈ సినిమా తర్వాత బాహుబలి 2 సినిమా చేసి మరింత విజయాన్ని అందుకున్న రాజమౌళి.. రామ్ చరణ్, ఎన్టీఆర్ తో కలిసి మల్టీ స్టారర్ సినిమా చేసి ఏకంగా గ్లోబల్ స్థాయి ఇమేజ్ దక్కించుకున్నారు. అంతేకాదు ఈ సినిమా ఆస్కార్ బరిలో దిగింది కూడా.. పైగా ఈ సినిమా లోని నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన రాజమౌళికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రస్తుతం మహేష్ బాబుతో యాక్షన్ అడ్వెంచర్ మూవీని చేయబోతున్నారు. ఈ సినిమాకి రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్న విషయం తెలిసిందే.

Rajamouli: Do you know the movie in which Jakkanna is playing the role of Bala Krishna? Look Adurs..!
Rajamouli: Do you know the movie in which Jakkanna is playing the role of Bala Krishna? Look Adurs..!

మోడ్రన్ మాస్టర్స్ గా రాజమౌళి డాక్యుమెంటరీ..

ఇదిలా ఉండగా ఇటీవలే రాజమౌళి పై నెట్ఫ్లిక్స్ ఓటీటీ ఒక డాక్యుమెంటరీ కూడా చేసింది. మోడ్రన్ మాస్టర్స్ అనే పేరుతో నెట్ ఫ్లిక్స్ రాజమౌళి పై చేసిన డాక్యుమెంటరీలో రాజమౌళి గురించి ప్రభాస్, రాంచరణ్, ఎన్టీఆర్, కీరవాణి, రమా రాజమౌళి , రానా , విజయేంద్ర ప్రసాద్ ఇలా చాలామంది ప్రముఖులు మాట్లాడారు. హాలీవుడ్ డైరెక్టర్స్ రసో బ్రదర్స్ , జేమ్స్ కామరూన్ తో సహా చాలామంది ఈయన గురించి గొప్పగా ప్రశంసించారు కూడా.. దీంతో ఈ రాజమౌళి డాక్యుమెంటరీ భారీ క్రేజ్ దక్కించుకుంది. ముఖ్యంగా వీరంతా కూడా మనకు తెలియని ఎన్నో విషయాలను రాజమౌళి గురించి ఒక్కొక్కటిగా చెబుతుంటే, అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా తన కొడుకు గురించి ఎవరికీ తెలియని విషయాన్ని పంచుకున్నారు.

బాల కృష్ణుడిగా రాజమౌళి లుక్ అదుర్స్..

విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. రాజమౌళి ఒక సినిమాలో తన చిన్నప్పుడు కృష్ణుడి పాత్రలో నటించాడు.. కీరవాణి తండ్రి శివశక్తి దత్తా , నేను కలిసి “పిల్లనగ్రోవి” అనే సినిమాను నిర్మించాం. ఆ సినిమాకి శివశక్తి దత్తా దర్శకుడు. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా ఆగిపోయింది. ముఖ్యంగా ఆ సినిమా వల్ల మేము ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నాము. అంటూ వివరించారు విజయేంద్ర ప్రసాద్. అంతేకాదు రాజమౌళి చిన్నప్పుడు ఈ సినిమా కోసం కృష్ణుని గెటప్ వేసిన ఫోటోని కూడా ఆయన ఈ డాక్యుమెంటరీ కోసం అందించారు కూడా.. దీంతో ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. కృష్ణుడు చాలా అందంగా ఉన్నాడు అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. మరి పిల్లన గ్రోవి సినిమా ఎందుకు విడుదల కాలేదో తెలియదు కానీ ఈ సినిమా విడుదల కాకముందే వీరికి బాగా నష్టాలను మిగిల్చిందని సమాచారం. మరి ఈ సినిమాను మోడ్రన్ గా తీసి రాజమౌళి తనను మళ్ళీ అభిమానులకు పరిచయం చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఏది ఏమైనా రాజమౌళి బాల కృష్ణుడి గెటప్ లో చాలా అందంగా ఉన్నాడని చెప్పవచ్చు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు