Rajamouli fired on Mahesh Babu : మహేష్‌పై క్లాస్ పీకిన జక్కన్న… తీరు మార్చుకోవాల్సిందే అంటూ హెచ్చరిక

SSMB29: శాంతి నివాసం అనే సీరియల్ కి దర్శకుడుగా పనిచేసిన రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సినిమా దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. నిన్ను చూడాలని సినిమాతో డిజాస్టర్ అందుకున్న ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు రాజమౌళి. ఇకపోతే రాజమౌళి స్థాయి గురించి స్థానం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసిన దర్శకుడు రాజమౌళి. ఇప్పుడు రాజమౌళి నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే చాలు ప్రపంచమంతా వేయికళ్లతో ఎదురు చూస్తారు.

RRR

ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్

స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి తన స్థాయిని అంచెలంచెలుగా పెంచుకుంటూ వెళ్ళాడు రాజమౌళి. ఇప్పటివరకు ఇండియన్ సినిమా హిస్టరీలో ఫెయిల్యూర్ చూడని ఏకైక దర్శకుడు అని చెప్పొచ్చు. ఒక సీన్ ని బీభత్సంగా ఎలివేట్ చేయాలన్న, సంగీత దర్శకుడు నుంచి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని ఇప్పించుకోవాలన్న, ఒక ఎమోషన్ ను పీక్ తీసుకెళ్లాలి అనుకున్న ఇవన్నీ అలవోక గా చేయగలిగే సామర్థ్యం ఉన్న దర్శకుడు రాజమౌళి. రీసెంట్గా త్రిబుల్ ఆర్ సినిమాతో అద్భుతమైన హిట్ అందుకున్నాడు రాజమౌళి.

- Advertisement -

మొదటిసారి స్టార్ హీరో తో

ఇకపోతే రాజమౌళి కెరియర్ లో ఇప్పటివరకు స్టార్ హీరోతో సినిమా చేయలేదు. మొదటిసారి సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరో తో పని చేస్తున్నాడు రాజమౌళి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్స్ లా ఫీల్ అయ్యే ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వీళ్ళందరికీ కూడా స్టార్ డంను తీసుకొచ్చింది ఎస్ఎస్ రాజమౌళి. కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్టార్డం ఉన్న ఇద్దరు హీరోలు ఒకటి పవన్ కళ్యాణ్, రెండు మహేష్ బాబు. వీళ్ళ సినిమాలు రీ రిలీజ్ కి రెస్పాన్స్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే మొదటిసారి ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరోని రాజమౌళి ఎలా డీల్ చేస్తాడు అని అందరిలో ఒక క్యూరియాసిటీ ఉంది.

మహేష్ బాబు తీరుపై అసంతృప్తి

రాజమౌళి ఒక సినిమా విషయంలో ఎంత పర్టిక్యులర్ గా ఉంటారు మనకు తెలియనిది కాదు. సినిమాను సంవత్సరాల తరబడి చెక్కుతూ ఉంటారు అందుకనే రాజమౌళికి జక్కన్న అనే మరో పేరు ఉంది. ఇకపోతే రాజమౌళి సినిమాల్లో హీరోల ఫస్ట్ లుక్ గురించి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. రాజమౌళి సినిమాని చేస్తున్నారు అన్నప్పుడు బయట హీరోలు ఎక్కువగా కనిపించరు. కానీ ప్రస్తుతం మహేష్ బాబుకు ఉన్న సిచ్యువేషన్స్ వలన కనిపించాల్సి వస్తుంది. దీనివలన మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే సినిమా లుక్ అనేది ముందుగానే రివీల్ అవుతుంది అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై ఎస్ఎస్ రాజమౌళి కూడా మహేష్ విషయంలో అసంతృప్తిగా ఉన్నారని, మహేష్‌ కు జక్కన క్లాస్ పీకారని… తీరు మార్చుకోవాల్సిందే అంటూ హెచ్చరించారని కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు