Rajamouli: మొదటిసారి బాహుబలి వివాదం పైన స్పందించిన రాజమౌళి..!

Rajamouli.. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయి ఇమేజ్ దక్కించుకున్న రాజమౌళి.. ఇటీవల ఇండియన్ సినిమాలలో ముఖ్యంగా తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఈయనకే దక్కుతుంది. అయితే రాజమౌళి పై కూడా విమర్శలు తప్పలేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన ఈయనను ఈయనను బాహుబలి సినిమా విషయంలో కొంతమంది విమర్శించారు కూడా. ప్రత్యేకించి అందులో కొన్ని సన్నివేశాలను లేవనెత్తి మరీ వివాదం సృష్టించారు. అయితే ఈ విషయంపై డైరెక్టర్ రాజమౌళి స్పందిస్తూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Rajamouli: For the first time, Rajamouli reacted on the Baahubali controversy..!
Rajamouli: For the first time, Rajamouli reacted on the Baahubali controversy..!

బాహుబలి పై విమర్శలు..

బాహుబలి -1 సినిమాలో.. కింద ఉండే ప్రభాస్, తమన్నా కోసం భారీ జలపాతం మీదుగా మరో రాజ్యానికి వెళ్తాడు. అక్కడ తమన్నా ను చూసి ఆశ్చర్యపోతాడు. అయితే ఆమె ప్రభాస్ ఊహించినట్టు ఉండదు. తమన్నా అక్కడ స్త్రీ తత్వాన్ని మరిచిపోయి యోధురాలిగా కనిపిస్తుంది. అయితే ప్రభాస్ ఒక పాటతో తమన్నా అమ్మాయి అని గుర్తు చేస్తాడు. ఆ సన్నివేశంలో తమన్నా అనుమతి లేకుండానే ప్రభాస్ ఆమెను తాకుతాడు. అయితే దీనిపై అప్పట్లో విమర్శలు గుప్పించారు. తమన్నా అనుమతి లేకుండానే ప్రభాస్ పాత్ర ఆమెను బలవంతం పెట్టడంపై కూడా విమర్శలు వచ్చాయి.

స్పందించిన రాజమౌళి..

దీనిపై స్పందించిన రాజమౌళి డాక్యుమెంటరీలో ఈ ఆరోపణపై స్పందించాడు. తమన్నాకు (విప్లవం, యుద్ధం) అదంతా ఇష్టం లేదని ప్రభాస్ పాత్ర తెలుసుకుంటాడు .ఎందుకంటే పాట కంటే ముందు తమన్నా చిరాకుతో నదిలో ఆమె ముఖం వైపు చూస్తూ ఉండడం ప్రభాస్ గమనిస్తాడు. అలాగే మొదటిసారి ప్రభాస్ , తమన్నా ఎదురెదురుగా వచ్చినప్పుడు తమన్నా తన కత్తిని ప్రభాస్ ఛాతీ పై ఉంచుతుంది. ఇక అప్పుడు ప్రభాస్ దానిపై స్పందించిన విధానం చూసి స్పష్టం అవుతుంది. అంతకుమించి విమర్శించే వారికి చెప్పడానికి ఇంకా ఏమీ లేదు అంటూ తెలిపారు రాజమౌళి.

- Advertisement -

డాక్యుమెంటరీలో స్పందించిన రాజమౌళి..

ఇకపోతే ఇండియన్ సినిమా చరిత్రలో అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచింది బాహుబలి. ఈ సినిమాకి ముందు కూడా భారీ బడ్జెట్ తో ఏ సినిమా చేయలేదు. పైగా ఆ సినిమాలు అంత భారీ వసూలు రాబట్టిన సినిమాలు కూడా లేవు. రాజమౌళి సినిమాల గురించి నెట్ ఫ్లిక్స్ లో ఒక డాక్యుమెంటరీ విడుదల చేశారు. అందులో రాజమౌళి బాహుబలి సినిమా గురించి మాట్లాడడం విశేషం. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారుతోంది. మొత్తానికైతే బాహుబలి సినిమా వివాదం పై రాజమౌళి స్పందించి ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు.

రాజమౌళి సినిమాలు..

రాజమౌళి విషయానికొస్తే.. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి ఎస్.ఎస్.ఎమ్.బీ.29 అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ గా సాగే ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల్లో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.ఈ సినిమాకు కథను అందిస్తున్న రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు