Rajamouli : గ్లోబ‌ల్ ట్రావెల్‌

తెలుగు సినిమాని ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్లిన ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి. ముఖ్యంగా బాహుబ‌లి సినిమాతో ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు రాజ‌మౌళి. RRR సినిమా చూసి ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కులు, సినీ టెక్నీషియ‌న్లు రాజ‌మౌళి ప‌నితనాన్ని మెచ్చుకుంటున్నారు. అంతేకాదు.. ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్స్ నుంచి రాజ‌మౌళికి ఆహ్వానం అందుతుంది.

తాజాగా రాజ‌మౌళి కెన‌డాలో టొరంటో ఫిలిం ఫెస్ట్‌కి హాజ‌ర‌య్యారు. ఇక ఫిలిం ఫెస్టివ‌ల్‌లో రాజ‌మౌళి తీసిన సినిమాల‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. అయితే రాజ‌మౌళి RRR త‌రువాత మ‌హేష్ బాబుతో ఓ సినిమా ఉంటుంద‌ని ప్ర‌క‌టించాడు. ఇప్ప‌టికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుగుతున్నాయి. మ‌హేష్-రాజ‌మౌళి కాంబోలో సినిమా అన‌డంతో ప్రేక్ష‌కుల్లో అంచనాలు భారీగానే పెరిగాయి.

రాజ‌మౌళి టొరెంటో ఫిలిం ఫెస్టివ‌ల్‌లో మాట్లాడుతూ.. నా నెక్ట్స్ సినిమా మ‌హేష్ బాబుతో అని, గ్లోబ‌ల్ మొత్తం ట్రావెల్ అయ్యే ఒక అడ్వెంచ‌ర్ త‌ర‌హాలో ఈ మూవీ ఉంటుంద‌ని చెప్పారు. మ‌హేష్ ప్ర‌పంచ దేశాల‌న్నీ చుడుతూ సాహ‌సాలు చేసే పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. గ‌తంలో ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఆఫికా అడ‌వుల నేప‌థ్యంలో ఈ సినిమా ఉంటుంద‌ని చెప్పారు. ఇక ఇప్పుడు రాజ‌మౌళి చెప్పిన దాన్ని బ‌ట్టి చూస్తే మాత్రం గ్రాండ్‌గానే ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు