RRR : “మహాభారతం” ప్రాజెక్ట్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన రాజమౌళి

ప్రేక్షకులని మెప్పించేలా ఒక సినిమా తీయటమే కష్టమవుతున్న ఈ రోజుల్లో గత 22 యేళ్లుగా ప్లాప్ సినిమా అంటూ లేకుండా బ్లాక్ బస్టర్ సినిమాలు తీస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించేలా చేసిన దర్శకుడు రాజమౌళి. ఐతే హిట్ లేదా సూపర్ హిట్ అంతకు మించి ఇంకేమీ ఉంటుందిలే అని ఊరుకున్న ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లకి రాజమౌళి బాహుబలి సినిమాతో తట్టి లేపి ప్రపంచ సినిమాతో పోటీ పడాలని నేర్పించారు. ఇక RRR తో అయితే ఏకంగా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు ని ఇండియాకి తీసుకొచ్చి పెట్టాడు. ఎన్ని విజయాలు సాధించినా, ఎన్ని అవార్డులు వచ్చినా నిరాడంబరంగా ఉండే వ్యక్తిత్వం ఈ దర్శకధీరుడికే సొంతం.

అయితే ఇటీవలే రామోజీ ఫిలిం సిటీ లో నిర్వహించిన ISHKS( డాక్టర్స్ మీట్ ) కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి కాసేపు వాళ్ళతో ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి వాళ్ళతో ముచ్చటించారు. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి విజేంద్రప్రసాద్ ఆల్రెడీ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. యాక్షన్ అడ్వెంచర్ గా సినిమాని భారీ స్కెల్ లో తీయాలని ఆ దిశగా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. మహేష్ బాబు సినిమా తరువాత రాజమౌళి ఏ ప్రాజెక్ట్ చేస్తాడని అందరిలో కన్ఫ్యూజన్ ఐతే ఉంది. అయితే ఈ కన్ఫ్యూజన్ కి రాజమౌళి ఈ కార్యక్రమంలో ఒక మోస్తరు క్లారిటీ ఇచ్చారు.

పలు సందర్భాలలో మహాభారతం సినిమాగా మలచటం తన గోల్ అని చెప్తూ వస్తున్న రాజమౌళి, ఈ కార్యక్రంలోను కూడా అదే విషయాన్ని చెప్పారు. తాను ప్రస్తుతం తీస్తున్న సినిమాలన్నీ ఫ్యూచర్ లో మహాభారతంని ఎలా ప్రెసెంట్ చేయాలి అనే ఉదేశ్యంతోనే సినిమాలు చేస్తున్న అని ఆయన చెప్పారు. కాకపోతే మహాభారతం లాంటి కథని తాను ఒకటి, రెండు పార్ట్ లుగా తీయలేను కనీసం 10 పార్ట్స్ గా అయిన తీయాలనుకుంటున్న అని తన మనసులో మాటని బయట పెట్టారు. అలాగే మహాభారతం సినిమా తీయటం తన జీవిత ఆశయం అంటూ చెప్పుకొచ్చారు. మహాభారతం అన్ని వెర్షన్స్ చదవడానికే తనకి సంవత్సరం టైం పడుతుందని, అవి అన్ని చదివిన తరువాత నిర్ణయం తీసుకుంటానని ఆయన అన్నారు. అయితే దీన్ని బట్టి చూస్తే రాజమౌళి వచ్చే ఒకటి, రెండు సంవత్సరాలలో మహాభారతం గురించి అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు