Rajamouli: వందేళ్ల నాటి కథ రీమేక్.. కట్ చేస్తే..?

Rajamouli.. దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరికిన అత్యంత అరుదైన ఆణిముత్యం అనడంలో సందేహం లేదు. తన సినిమాలతో తెలుగు సినీ పరిశ్రమను ఎల్లలు దాటించి నేడు గ్లోబల్ స్థాయిలో తెలుగు సినిమా గుర్తించేలా పాపులారిటీ దక్కించుకున్న ఈయన.. తన సినిమాలతో తనకు మాత్రమే కాదు.. ఏకంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కూడా గుర్తింపు లభించేలా చేశారు. చేసింది కేవలం కొన్ని సినిమాలే అయినా అన్నింటితో బ్లాక్ బాస్టర్ విజయాలను సొంతం చేసుకొని అరుదైన రికార్డులు క్రియేట్ చేశారు రాజమౌళి.

రీమేక్ తో కోట్లు కొల్లగొట్టిన జక్కన్న..

Rajamouli: Remake of hundred years old story.. if cut..?
Rajamouli: Remake of hundred years old story.. if cut..?

ఇకపోతే సాధారణంగా రాజమౌళి కథలన్నీ కూడా చాలా భిన్నంగా ఉంటాయి. ఆయన ఏ సినిమాని కూడా రీమేక్ చేయరు. కానీ ఆయన చేసింది కొన్ని సినిమాలు అయినా అందులో ఒక సినిమా రీమేక్ చేశారంటే నమ్మగలరా.. ఇది అక్షర సత్యం.. అయితే ఆ కథ ఇప్పటిది కాదు.. దాదాపు వందేళ్ళ క్రితం నాటి కథ.. ఆ సినిమాను తెరపై చూపించి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడమే కాదు కమెడియన్ ను హీరోగా కూడా మార్చేశారు రాజమౌళి.. మరి రాజమౌళి తీసిన ఆ సినిమా ఏంటి? ఏ సినిమాకు రీమేక్ గా చేశారు..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం

అవర్ హాస్పిటాలిటీ రీమేక్..

సునీల్ హీరోగా నటించిన మర్యాదరామన్న సినిమా గుర్తుంది కదా..? ఆ సినిమా ఒక హాలీవుడ్ సినిమాకు రీమేక్.. అది కూడా దాదాపు వందేళ్ళ క్రితం నాటిది.. ఆ సినిమా పేరు అవర్ హాస్పిటాలిటీ.. ఈ సినిమా నుంచి మర్యాద రామన్న కథ పుట్టింది.. హీరో ఫాదర్ జనరేషన్ కు ఊర్లో గొడవలు.. ఆ ఊరికి దూరంగా బ్రతుకుతున్న హీరో తనకు ఊర్లో ఆస్తులు ఉన్నాయని తెలిసి.. తిరిగి తన ఊరికి వెళ్లడం.. ట్రైన్ లో హీరోయిన్ పరిచయం అవ్వడం.. శత్రువు ఇంటికి వెళ్లడానికి శత్రువునే దారి అడగడం.. ఇల్లు దాటితే హీరోని చంపేయాలని కాపు కాసే శత్రువులు.. ఇలా మర్యాదరామన్న సినిమా మొత్తం హాలీవుడ్ మూవీ అవర్ హాస్పిటాలిటీ లానే అనిపిస్తుంది. కాకపోతే ఈ సినిమాను మన నేటివిటీకి తగ్గట్టుగా.. ఎస్ ఎస్ కంచి సినిమా స్క్రీన్ ప్లేను రాసుకున్నారు.. ఈ కంచి ఎవరో కాదు రాజమౌళి కజిన్.. పైగా ట్రైన్ ఎపిసోడ్ లో కామెడీ క్యారెక్టర్ లో కనిపించేది కూడా ఆయనే..

- Advertisement -

వందేళ్ళ క్రితం నాటి కథ..

అయితే గతంలోనే ఈ సినిమా రైట్స్ ను కొనాలని రాజమౌళి అనుకున్నారట.. కానీ ఆ సినిమా వాళ్ళు ఎవరు ఇప్పుడు బ్రతికి లేకపోవడంతో ఆయన కొనుగోలు చేయలేదట.. అయితే ఆ క్రెడిట్ మాత్రం అవర్ హాస్పిటాలిటీ సినిమాకే ఇచ్చేశారు.. మర్యాదరామన్న సినిమాను అవర్ హాస్పిటాలిటే సినిమాను బేస్ చేసుకున్నట్లు క్రెడిట్ ఇచ్చారు రాజమౌళి.. ఇకపోతే ఈ సినిమా కోసం అప్పట్లో కేవలం రూ.12 కోట్లు ఖర్చుపెడితే.. ఫైనల్ రన్ ముగిసే సరికి ఏకంగా రూ.40 కోట్లు రాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు కళ్ళు చెదిరే లాభాలు అందించింది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు