Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో రాజమౌళి, వావ్ ఇది కదా కావాల్సింది.?

Pawan Kalyan: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది అని అంటే చాలు థియేటర్ వల్ల ఒక రకమైన పండగ వాతావరణం నెలకొంటుంది. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో వరుసగా హిట్ సినిమాలు చేశాడు. అయితే ఖుషి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ దాదాపు 10 ఏళ్ల పాటు వరుసగా డిజాస్టర్స్ చూశాడు. అయితే ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం తగ్గలేదు ఇంకా ఇంకా పెరిగారు. దీనికి పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం కారణం అని చెప్పొచ్చు.

లేకపోతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి కీలకపాత్రను పోషించి ఇప్పుడు ఎంతటి పదవిలో ఉన్నారు చాలామందికి తెలిసిందే. 2014లో పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నేడు ఒక స్థాయిలో ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో చాలా సినిమాలు చూశారు. కానీ కొంతమంది దర్శకులతో పవన్ కళ్యాణ్ పనిచేస్తే చూడాలని చాలామంది కలలు కంటున్నారు. అందులో ఎస్.ఎస్ రాజమౌళి ఒకరు. ఒక సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా చెబుతూ వచ్చారు. ఎస్.ఎస్ రాజమౌళి ఇంటికి వస్తూ ఉంటారు ఏదైనా కథ చెబుతారు ఏమైనా వెయిట్ చేస్తుంటాను కానీ ఆయన నార్మల్ గా వెళ్లిపోతారని పని సినిమా ఆడియో లాంచ్ లో చెప్పారు.

SS Rajamouli

- Advertisement -

ఇకపోతే పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి కూడా ఎస్ఎస్ రాజమౌళి చాలాసార్లు చెబుతూ వచ్చాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను చేస్తున్న విషయం తెలిసిందే. ఇక రామోజీ రావు గారికి స్మారక కి సభను నిర్వహించారు కొంతమంది ప్రముఖులు. దీనికి చాలామంది సినిమా వాళ్లు హాజరయ్యారు. అందులో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత చాలామంది నిర్మాతలను కూడా కలిశారు. అయితే యాదృచ్ఛికంగా ఈ స్మారక సభలో ఎస్.ఎస్ రాజమౌళి పవన్ కళ్యాణ్ కలిశారు. ప్రస్తుతం మీ ఫోటో వైరల్ గా మారుతుంది. వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా కావాలి అంటూ చాలామంది సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు