Rajasaab Update : ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్… రాజా సాబ్ గ్లింప్స్ రెడీ

Rajasaab Update : ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్కి మేనియానే నడుస్తోంది. సోషల్ మీడియాతో పాటు అందరూ ప్రభాస్ హీరోగా నటించిన బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక మూవీ లవర్స్ అంతా మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతున్న కల్కి మూవీని ఎప్పుడెప్పుడు వెండితెరపై చూస్తామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ కూడా ఈ మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. అయితే ఇలాంటి టైంలో ఈ ఫీవర్ ని ప్రభాస్ హీరోగా నటిస్తున్న నెక్స్ట్ మూవీ రాజా సాబ్ టీం ఉపయోగించుకుంటుంది. పనిలో పనిగా ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ రాబోతుందని సమాచారం.

రాజా రాబ్ రాకకు అంతా సిద్ధం…

కల్కి మేనియాను ఉపయోగించుకుంటూ ది రాజా సాబ్ మూవీ నుంచి వరుసగా అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్న తమన్ మ్యూజిక్ సిట్టింగ్స్ షురూ చేశాడని తెలుపుతూ డైరెక్టర్ మారుతి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. రాజా సాబ్ థీమ్ సౌండ్ క్లిప్ ను షేర్ చేస్తూ ప్రభాస్ అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఫిలింనగర్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రాజా సాబ్ కు సంబంధించిన స్పెషల్ గ్లింప్స్ రెడీ అయ్యిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ ఫస్ట్ గ్లింప్స్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతోంది. అయితే కల్కి మూవీ రిలీజ్ అయ్యాకే ఈ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.

Prabhas' film with director Maruthi titled 'The Rajasaab'; motion poster out - The Hindu

- Advertisement -

రిలీజ్ పై లేని క్లారిటీ

ఇదిలా ఉండగా ది రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ తో యంగ్ హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ ఈ సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ది రాజా సాబ్ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమన్ సంగీతాలు సమకూరుస్తుండగా, ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక రాజా సాబ్ మూవీ రిలీజ్ గురించి ఇంకా క్లారిటీ లేదు. కొంతమంది 2024లో రిలీజ్ చేస్తారంటే, మరి కొంతమంది మాత్రం 2025 లోనే ఈ సినిమాను రిలీజ్ చేస్తారని అంటున్నారు. అయితే కల్కి మూవీ రిలీజ్ కు ముందు నుంచే డైరెక్టర్ మారుతి ఈ సినిమా ప్రమోషన్లు షురూ చేయడం చూస్తుంటే కచ్చితంగా 2025 మొదట్లోనే రాజా సాబ్ మూవీని థియేటర్లలోకి దించే ప్లాన్లో ఉన్నారేమో అనిపిస్తుంది. ఇప్పటికే నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ కొంతకాలం క్రితం ఓ ఇంటర్వ్యూలో సంక్రాంతికి ప్రభాస్ కోసం తప్పకుండా స్లాట్ ఉంటుందని కామెంట్ చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాలంటే డైరెక్టర్ మారుతీ రాజా సాబ్ ప్రమోషన్లను పూర్తి స్థాయిలో స్టార్ట్ చేసేదాకా ఆగాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు