Rajeev Kanakala: నా భార్యను ట్రోల్ చేశారు.. మా నాన్న సూసైడ్ అని పెట్టారు ?

Rajeevi Kanakala: బుల్లితెర యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ భామ కేరళ కుట్టి అయినప్పటికీ తెలుగులో అనర్గళంగా మాట్లాడగలదు. ఎంత పెద్ద స్టార్ హీరో ఈవెంట్ అయినా…. ఎంత చిన్న హీరో ఈవెంట్ అయినా సరే అక్కడ కచ్చితంగా సుమ హోస్ట్ చేయాల్సిందే. తన అద్భుతమైన వాక్చాతుర్యంతో ఈవెంట్ ను సక్సెస్ చేస్తోంది. దాదాపు రెండు దశాబ్దాలుగా బుల్లితెరను ఏలుతూ ప్రజల మనసులను దోచుకుంది. ప్రతి ఒక్కరికి యాంకర్లలో ఎవరు ఇష్టమంటే సుమ అనే చెబుతారు అంతలా మనందరినీ ఆకట్టుకుంది. ఇక సుమ రాజీవ్ కనకాలను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

సుమ వివాహ అనంతరం యాంకర్ గా రాణిస్తూనే ఉంది. అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్ ను కూడా నడిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలను అప్లోడ్ చేస్తూ ప్రేక్షకులకు ఎల్లప్పుడూ చేరువలో ఉంటుంది సుమ. రాజీవ్ కనకాల సినీ నటుడు అన్న సంగతి తెలిసిందే. ఇక రాజీవ్ కనకాల, సుమ జోడి చూడముచ్చటగా ఉంటుంది. రాజీవ్ ఎన్నో సినిమాల్లో నటించారు. అయితే తాజాగా టాలీవుడ్ నటులపై తప్పుడు ప్రచారం చేస్తున్న చానెల్స్ పై విరుచుకుపడ్డారు రాజీవ్.

ఇటీవలే ఓ టీవీ ఛానల్ కు రాజీవ్ కనకాల ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ…. సుమారు 250 చానల్స్ నటీనటులపై ట్రోలింగ్ చేస్తున్నట్టుగా గుర్తించాము. ఓ సమయంలో నా కూతురు ఓ ఫంక్షన్ కు వచ్చింది. తనపై లేనిపోనివి రాసి బాధపడేలా చేశారు. నేను ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తే వాళ్ళు చాలా బాగా ఎడిట్ చేసి పబ్లిష్ చేశారని…. అయితే సదరు ఛానల్ అనుబంధ మరో సబ్ ఛానల్ తన వీడియోను ముక్కలు ముక్కలుగా చేసి షార్ట్ పెట్టిందని ఆయన తెలియజేశారు. ఆ ముక్కల్లో ఓ వీడియోకి సూసైడ్ చేసుకొని చనిపోయిన దేవదాస్ కనకాల అని థంబ్ పెట్టారని రాజీవ్ చెప్పుకొచ్చారు.

- Advertisement -

suma-has-took-strictly-decision-for-her-son

ఆ ఇంటర్వ్యూలో మా నాన్న సూసైడ్ చేసుకునే పరిస్థితులు వచ్చాయని ఒక మాట నేను చెప్పానని…. దానిని బేస్ చేసుకుని ఫేక్ న్యూస్ వైరల్ చేశారు. ఆ థంబ్ చూడగానే నాకు ఎక్కడో కాలిందన్నారు. ఇక ఇంటర్వ్యూ తీసుకున్న వ్యక్తికి ఫోన్ చేస్తే…. అతను సారీ చెప్పి వెంటనే థంబ్ మార్చేశారని రాజీవ్ కనకాల గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా సుమ, నేను విడాకులు తీసుకుంటున్నట్లు ఎన్నోసార్లు వార్తలు కూడా వచ్చాయి. అంతేకాకుండా నేను వేరే వారితో ఎఫైర్ పెట్టుకున్నట్లు ఎన్నో రకాల వార్తలు రాశారు. అవన్నీ ఫేక్ వార్తలు. మేమిద్దరం విడాకులు తీసుకునే పరిస్థితి అస్సలు రాదు. మేమిద్దరం ఒకరినొకరం చాలా అర్థం చేసుకొని సంతోషంగా ఉంటున్నాము. ఇకపైన ఇలాంటి ఫేక్ న్యూస్ లు రాయకండి అని రాజీవ్ కనకాల రిక్వెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజీవ్ కనకాల చేసిన వాక్యాలు వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు