Rajeshdanda : లక్ అంటే ఈ నిర్మాతదే.. షూటింగ్ లో ఉండగానే 2 సినిమాల బిజినెస్ లు క్లోజ్…

Rajeshdanda : టాలీవుడ్ లో చిన్న సినిమాల నిర్మాతల్లో ఫేమస్ రాజేష్ దండ. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ స్టార్ట్ చేసి, నిర్మతగా ఎదిగి, ఇప్పుడు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ఏడేళ్ల కింద ఒక్క క్షణం సినిమాతో నిర్మాతగా మారిన రాజేష్, ఆ తర్వాత ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం తీసాడు. ఈ రెండు సినిమాలు అంతగా ఆడలేదు. కానీ తాను నిర్మించిన మూడో సినిమా ‘సామజవరగమన’ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాకుండా పెట్టుబడికి మూడు రెట్లు లాభాల్ని ఆర్జించాడు. ఇప్పుడు ఆ సినిమా ఇచ్చిన విజయోత్సాహం తో వరుస సినిమాలు నిర్మిస్తూ దూసుకుపోతున్నాడు. ఈ ఇయర్ లో ఊరు పేరు భైరవకోనతో మరో సక్సెస్ అందుకున్నాడు. ఇదిలా ఉండగా రాజేష్ దండ ప్రస్తుతం రెండు సినిమాలు నిర్మిస్తున్నాడు. అందులో ఒకటి అల్లరి నరేష్ తో నిర్మిస్తున్న “బచ్చలమల్లి” సినిమా కాగా, మరొకటి సందీప్ కిషన్ తో నిర్మిస్తున్న SK30 ప్రాజెక్ట్. ఈ రెండు సినిమాలు కూడా షూటింగ్ చివరిదశలో ఉన్నాయి.

Rajeshdanda is getting profits before the release of movies

లక్ అంటే రాజేష్ దే.. రిలీజ్ కి ముందే లాభాలు..

ఇక నిర్మాత రాజేష్ దండా (Rajeshdanda) సామజవరగమన సినిమా లాభాల ఊపులో ఇతర సినిమాలు రిలీజ్ కాకుండానే ప్రాఫిట్స్ వెనకేసుకోవడం స్టార్ట్ చేసాడు. రాజేష్ దండా అల్లరి నరేష్ తో నిర్మిస్తున్న ‘బచ్చలమల్లి’ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా, ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ టీజర్, ట్రైలర్ లు కూడా రాకముందే క్రేజీ రేటుకి అమ్ముడు పోయిందట. అల్లరి నరేష్ కెరీర్ లో ఈ మధ్య కాలంలో వచ్చిన హైయెస్ట్ రేటు ఇదేనని టాక్. ఇక సందీప్ కిషన్ తో తెరకెక్కిస్తున్న sk30 ప్రాజెక్ట్ కి సంబంధించి ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే ‘నాన్ థియేటర్ బిజినెస్ క్లోజ్ అయిందట. ఈ రెండు సినిమాలతో ఓ మీడియం రేంజ్ సినిమా నిర్మించే లాభాల్ని పొందాడని టాక్ నడుస్తుంది.

- Advertisement -

రెండు సినిమాలు ఎంతవరకొచ్చాయంటే…

ఇక అల్లరి నరేష్ హీరోగా రాజేష్ దండ నిర్మిస్తున్న బచ్చలమల్లి సినిమా ఓ లోకల్ రౌడీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో అల్లరి నరేష్ ఇప్పటివరకు కనిపించనంత డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు. ఆ మధ్య రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆల్మోస్ట్ షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా మంచి రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తుంది. ఇక సందీప్ కిషన్ తో ఊరు పేరు భైరవకోన నిర్మించిన కాంబో మళ్ళీ రిపీట్ చేస్తూ, ఈ మధ్యనే షూటింగ్ స్టార్ట్ చేసారు. అనిల్ సుంకరతో కలిసి రాజేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా కూడా హారర్ కాన్సెప్ట్ మాదిరిగానే ఉండబోతుందని టాక్ నడుస్తుంది. ఈ సినిమాపై మరింత క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఓవరాల్ గా నిర్మాత రాజేష్ దండ సోలో రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తూ అల్లరి నరేష్ బచ్చలమల్లి సినిమాని రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాడు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు