Rajinikanth: లోకేష్ కనకరాజ్ కూలీ సినిమా స్టార్ట్ అయ్యేది అప్పటినుంచే

Rajinikanth: తెలుగు ప్రేక్షకులు ఒక సినిమాకి చూపించే ఆదరణ వేరే ప్రేక్షకులు చూపించరు అనేది వాస్తవం. అందుకే చాలామంది తెలుగు ప్రేక్షకులను ఇష్టపడుతూ ఉంటారు. అయితే తెలుగు ప్రేక్షకులు కూడా ఏ భాషలో సినిమా ఉన్నా కూడా చూడటానికి ఇష్టపడతారు. ఆ భాష అర్థం కాకపోయినా కూడా సబ్ టైటిల్స్ పెట్టుకుని మరి ఆ సినిమాలను చూస్తారు. ఇకపోతే కేవలం తెలుగు డైరెక్టర్లకు మాత్రమే కాకుండా మిగతా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లు కూడా తెలుగు ఆడియోస్ ఎంతో రెస్పెక్ట్ ఇస్తూ మంచి ప్రేమను చూపిస్తారు. రీసెంట్ టెన్స్ లో మిగతా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులను బాగానే ఫాలో అవుతున్నారు తెలుగు ప్రేక్షకులు. అందులో కన్నడ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన ప్రశాంత్ నీల్, తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి చెందిన లోకేష్ కనకరాజు వంటి దర్శకులకు మంచి ఫ్యాన్స్ ఉన్నారు.

Lokesh Kanagaraj

నగరం సినిమాతో కెరీర్ మొదలు

ముందుగా షార్ట్ ఫిలిమ్స్ లో కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత నగరం సినిమాతో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు లోకేష్ కనకరాజు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. సందీప్ కిషన్ కెరియర్ లో కూడా ఇదొక బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఒక సినిమాని టెక్నికల్ గా ఎంత బాగా తీయొచ్చు అని తీసి చూపించాడు లోకేష్. ఈ సినిమా తర్వాత లోకేష్ చేసిన సినిమా ఖైదీ. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత లోకేష్ చేసిన మాస్టర్, విక్రమ్ , లియో వంటి సినిమాలు మంచి పేరును తీసుకురావడమే కాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ కూడా వసూలు చేశాయి.

- Advertisement -

లోకేష్ సినిమాటిక్ యూనివర్స్

మామూలుగా సినీమాటిక్ యూనివర్స్ అనేది మనం హాలీవుడ్ సినిమాలలో చూస్తూ ఉంటాం. అలానే తెలుగులో ఇప్పుడిప్పుడే ఇప్పుడు సినీమాటిక్ యూనివర్స్ అంటూ కొంతమంది దర్శకులు సినిమాలు చేయడం మొదలుపెట్టారు. దీనిని ఖైదీ అనే సినిమాతో ముందుగా మొదలుపెట్టాడు లోకేష్. విక్రమ్ సినిమా వస్తున్నప్పుడు ఒకసారి ఖైదీ సినిమా చూసి రండి అన్నప్పుడు చాలామంది ఏదో సప్రైజ్ ఉంది అని ఫీల్ అయ్యారు. విక్రమ్ చూసిన తర్వాత లొకేషన్ బ్రిలియన్స్ కి ఫిదా అయిపోయారు.

సూపర్ స్టార్ తో సినిమా

లోకేష్ కనగరాజ్ తమిళ్ లో ఉన్న స్టార్ హీరోలతో ఒక్కొక్కరితో సినిమా చేయటం మొదలుపెట్టాడు. ఒకపక్క విజయ్ తో రెండు సినిమాలను చేసిన లోకేష్. కమలహాసన్ తో విక్రమ్ అనే సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. ప్రస్తుతం రజనీకాంత్ తో సినిమాను చేస్తున్నాడు లోకేష్. ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకి కూలి అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ సినిమా షూటింగ్ జూలై ఒకటి నుంచి మొదలుకానున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు. ఈ సినిమాని సన్ పిక్చర్ సంస్థ నిర్మిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు