Rajinikanth: తండ్రిగా సర్వర్ ను దత్తత తీసుకున్న తలైవా.. ఆయన ప్రత్యేకత ఏంటంటే..?

Rajinikanth.. సాధారణంగా పిల్లలు లేని తల్లిదండ్రులు పిల్లలను దత్తత తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ తల్లిదండ్రులు లేని పిల్లలు.. తల్లిదండ్రులుగా కొంతమందిని దత్తత తీసుకోవడం అనేది సినిమాల్లోనే జరుగుతుంది. కానీ ఇక్కడ నిజజీవితంలో ఇలాంటి ఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.అది కూడా తలైవా జీవితంలో జరగడంతో ఈ విషయం కాస్త మరింత వైరల్ గా మారిందని చెప్పవచ్చు. సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రజినీకాంత్.. ఒక హోటల్ సర్వర్ ను తన తండ్రిగా దత్తత తీసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి ఆ దత్తత తీసుకున్న వ్యక్తి ఎవరు..? ఆయన ప్రత్యేకత ఏంటి..?అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

Rajinikanth: Thalai who adopted Sarwar as a father.. What is special about him..?
Rajinikanth: Thalai who adopted Sarwar as a father.. What is special about him..?

హోటల్ సర్వర్ ను దత్తత తీసుకున్న రజినీకాంత్..

రజినీకాంత్ (Rajinikanth)ఒక్క హోటల్ సర్వర్ ని తన తండ్రిగా దత్తత తీసుకున్నారట.అంతేకాదు ఆయనను నాన్న అని కూడా అంటారట. ఆ వ్యక్తి ఎవరు అనే విషయానికి వస్తే.. పాలెం కళ్యాణ సుందరం అనే వ్యక్తి లైబ్రేరియన్ గా పనిచేశారు. 30 ఏళ్ల సర్వీస్లో కళ్యాణ సుందరం తన సంపాదన మొత్తాన్ని దానధర్మాలకే ఉపయోగించారట. అంతేకాదు పదవి వరమన తర్వాత పెన్షన్ గా వచ్చిన రూ .10లక్షల కూడా ఆయన ఒక చారిటీ సంస్థకు దానంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. స్వార్థం వదిలేసి సంపాదించిన మొత్తం ఇతరులకు దానం చేసి, ఇతరుల కోసమే బ్రతుకుతున్నారు. ఇలాంటి కల్యాణ సుందరం సేవలను గుర్తించిన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ 20వ శతాబ్దపు అత్యుత్తమ వ్యక్తులలో ఒకరిగా ఈయనను గుర్తించింది.

సర్వర్ గా పనిచేసిన వ్యక్తి..

ఇకపోతే దానధర్మాలు చేయడంలో రజనీకాంత్ కూడా ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటారు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తిని రజినీకాంత్ దత్తత తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే కళ్యాణ సుందరం గతంలో దాదాపు పది సంవత్సరాలు పాటు ఒక హోటల్లో సర్వర్ గా కూడా పనిచేశారట. ఈయనను ఇప్పుడు తన ఇంటికి తీసుకెళ్లడానికి రజినీకాంత్ ఎన్నో ప్రయత్నాలు చేశారట. ఇంటికి రమ్మని పిలిచారు అంట కూడా.. కానీ కళ్యాణ సుందరం సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. రజినీకాంత్ ఇంటికి వెళ్లడానికి సంకోచించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి తలైవా అభిమానులు మాత్రమే కాదు పలువురు సెలబ్రిటీలు కూడా కళ్యాణ సుందరం(Kalyana sundaram) సింప్లిసిటీని అలాగే ఇతరులకు సహాయం చేయాలనే గొప్పతనాన్ని కొనియాడుతున్నారు.

- Advertisement -

రజనీకాంత్ సినిమాలు..

జైలర్ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు రజినీకాంత్. ఏడుపదుల వయసు దాటినా కూడా తన నటనతో అందరిని ఆకట్టుకున్నారు. ఆ తర్వాత తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన లాల్ సలాం సినిమాలలో అతిధి పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా విజయాన్ని అందుకోలేదు కానీ రజనీకాంత్ వల్లే సినిమా ఒకరకంగా నష్టపోలేదని చెప్పవచ్చు. ప్రస్తుతము టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయాన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రజినీకాంత్ కు సంబంధించిన ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. మరి కల్యాణ సుందరం ఈయనకు ఎలా పరిచయమయ్యారు.? ఎక్కడ పరిచయమయ్యారు..? అనే విషయాలు మాత్రం తెలియలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు