Rajinikanth: సూపర్ స్టార్ కి సెట్ లో ఘోర అవమానం.. నిర్మాత అంత మాట అనేసాడేంటి..?

Rajinikanth.. సౌత్ సినీ ఇండస్ట్రీలో రజనీకాంత్ కి ఎంత పెద్ద ఇమేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈమధ్య కాలంలో ఈయన సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతూ ఇండియా వైడ్ గా ఫేమ్ సొంతం చేసుకున్నారు . అలాంటి ఈయనను ఒక ప్రొడ్యూసర్ దారుణంగా అవమానించారట. అంతే కాదు నువ్వు నా సినిమాలో నటించాల్సిన అవసరం లేదు పో అంటూ దారుణంగా ప్రవర్తించినట్లు సమాచారం. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

Rajinikanth: The superstar was humiliated on the set.. What is the producer saying?
Rajinikanth: The superstar was humiliated on the set.. What is the producer saying?

మొదటి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు..

స్టైల్ ఐకాన్ గా ట్రెండ్ సెట్ చేసిన రజినీకాంత్ వృత్తిరీత్యా కండక్టర్.. మిత్రుడు సలహా మేరకు నటన రంగం వైపు అడుగులు వేశారు. చెన్నై వచ్చి నటన స్కూల్లో జాయిన్ అయ్యారు.. లెజెండ్రీ దర్శకుడు కే బాలచందర్ రజనీకాంత్ కు మొదటి అవకాశం ఇచ్చారు. 1975లో వచ్చిన అపూర్వ రాగంగల్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు .రజనీకాంత్ కెరియర్ బిగినింగ్లో విలన్, సపోర్టింగ్ రోల్స్ కూడా చేశారు . పాత్ర ఏదైనా సరే తన మార్కు మేనరిజంతో ఆకట్టుకున్నారు ఇక ఈయన మొదటగా హీరోగా చేసింది మాత్రం తెలుగు సినిమానే.. ” చిలకమ్మా చెప్పింది” అనే సినిమాలో పూర్తిస్థాయి హీరో పాత్ర చేశాడు. ఆ తర్వాత అంచలంచెలుగా ఎదుగుతూ మరింత పేరు దక్కించుకున్నారు. 80’ల నాటికి హీరోగా నిలదొక్కుకున్న ఈయన , 90′ ల నాటికి ఇండియా వైడ్ పేరు దక్కించుకున్నారు. అంతేకాదు జపాన్ వంటి దేశాలలో స్టార్ హీరోగా ఇప్పటికీ అక్కడ పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా అరుణాచలం, ముత్తు, నరసింహ , భాషా వంటి చిత్రాలు రజనీకాంత్ స్థాయి నీ మరెక్కడికో తీసుకెళ్లిపోయాయి.

సూపర్ స్టార్ కే అవమానం..

ఫస్ట్ పాన్ ఇండియా హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకున్న ఈయన 28 ఏళ్ల క్రితం ముత్తు సినిమాతో చేసిన రికార్డును ఇప్పటివరకు ఏ సినిమా కూడా చెరపలేకపోయింది. అయితే ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం మాత్రం ముత్తు రికార్డును బ్రేక్ చేసిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఒక్కో సినిమాకి రూ .210 కోట్ల పారితోషకం తీసుకుంటున్న ఈయన ఒకప్పుడు 1000 రూపాయల కోసం అవమానపడ్డారట. ఒక నిర్మాత హీరోగా ప్రయత్నాలు చేస్తున్న తొలినాళ్లల్లో ఒక సినిమాలో ఆఫర్ వచ్చిందట. రూ.6వేలు రెమ్యూనరేషన్ గా మాట్లాడుకున్నారు.షూటింగ్ మొదటి రోజే రజినీకాంత్ సెట్స్ కి వెళ్లారు. హీరో వచ్చాడు మేకప్ వేయమని నిర్మాత మేకప్ మెన్ కి చెప్పాడట. అంతలో లో ఒక వెయ్యి అడ్వాన్స్ గా ఇవ్వండి అని రజనీకాంత్ అడిగారట. దీంతో కోపగించుకున్న నిర్మాత అడ్వాన్స్ ఇస్తే కానీ మేకప్ వేసుకోనంత పెద్ద స్టార్ వా నువ్వు.. ఈ సినిమాలో నీకు ఛాన్స్ లేదు వెళ్ళిపో అంటూ అవమానించారట.. ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రజినీకాంత్.. ఆ తర్వాత పట్టుదలతో వచ్చిన ప్రతి పాత్ర చేస్తూ.. తనను తాను నిరూపించుకొని ఇప్పుడు సూపర్ స్టార్ గా ఎదిగారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు