Vettaiyan : తలైవాకి ఇదే మంచి ఛాన్స్.. కుదిరిందా మరోసారి భీభత్సమే..

Vettaiyan : సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. లాస్ట్ ఇయర్ “జైలర్” సినిమాతో మాస్ కం బ్యాక్ హిట్ ఇచ్చిన రజినీకాంత్, ఈ ఇయర్ బిగినింగ్ లో లాల్ సలాం తో డిజాస్టర్ అందుకున్నాడు. కానీ ఆ సినిమాలో తనది పూర్తి స్థాయి రోల్ కాదు. ఇకపోతే ఇప్పుడు రజినీకాంత్ చేస్తున్న ప్రాజెక్ట్స్ లో మోస్ట్ అవైటెడ్ సినిమాలుగా “వెట్టైయన్” , కూలీ సినిమాలున్నాయి. ఇందులో ఈ ఇయర్ అక్టోబర్ 10న రజినీకాంత్ ‘వేట్టైయన్’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాపై అభిమానుల్లో భారీ అంచనాలుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్ప్స్ మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇదిలా ఉండగా వేట్టైయన్ సినిమాతో రజినీకాంత్ మరోసారి రికార్డులు క్రియేట్ చేసే పనిలో ఉన్నాడు.

Rajinikanth Vettaiyan Movie Telugu Business Update

తెలుగులో మరోసారి చరిత్ర సృష్టించనున్నాడా?

ఇక తలైవా రజినికాంత్ (Rajinikanth) కి తెలుగులో కూడా అదిరిపోయే మార్కెట్ ఉందని తెలిసిందే. ఒక్కోసారి స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో తెలుగులో రజిని సినిమాలకి వసూళ్లు వస్తుంటాయి. ఆయన నటించిన చంద్రముఖి, శివాజీ, రోబో,2.0 లాంటి సినిమాలు తెలుగులో భారీ వసూళ్లు అందుకున్నాయి. ఇక లాస్ట్ ఇయర్ జైలర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే జైలర్ 80 కోట్ల గ్రాస్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఇప్పుడు మళ్ళీ జైలర్ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ వసూళ్లు అందుకోవాలని చూస్తున్నాడు రజిని. ఇక అక్టోబర్ 10న వేట్టైయన్ (Vettaiyan) సినిమా రిలీజ్ అవుతుండగా, అదే రోజున సూర్య కంగువ రిలీజ్ అవుతుంది.

- Advertisement -

తెలుగులో పోటిలేదు..

ఇక దసరా స్పెషల్ గా రజినీకాంత్ వెట్టైయన్ రిలీజ్ అవుతుండగా, ఆ సమయానికి తెలుగులో పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడంలేదు. సూర్య కంగువతో మాత్రమే పోటీ ఉంది. అందువల్ల తెలుగులో మళ్ళీ రజినీకాంత్ రికార్డు సృష్టించే ఛాన్స్ ఉంది. ఇక వేట్టైయన్ సినిమాకు తెలుగులో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ‘జై భీమ్’తో ప్రశంసలు అందుకున్న టిజి. జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా, అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫాహద్ ఫాజిల్ వంటి స్టార్ నటులు ఈ సినిమాలో నటిస్తుండడం వల్ల ఈ సినిమాపై భారీ హైప్ ఉండగా, ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను 15 కోట్లకు ఏషియన్ మూవీస్ వారు సొంతం చేసుకున్నారు. మంచి టాక్ వస్తే వేట్టైయిన్ తెలుగులోనే 50 కోట్లకు పైగా వసూళ్లు అందుకునే ఛాన్స్ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు