Rajinikanth: వెట్టియన్ రిలీజ్ డేట్ అఫీషియల్ అనౌన్స్మెంట్

Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్, ఇది కేవలం పేరు కాదు ఇది ఒక ప్రభంజనం. మామూలుగా రజనీకాంత్ తమిళ్ హీరో అయినా కూడా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితులు. రజనీకాంత్ సినిమా వస్తుంది అని అంటే తెలుగు ప్రేక్షకులు కూడా ఒకప్పుడు థియేటర్ దగ్గర క్యూ కట్టేవాళ్ళు. ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో రజనీకాంత్ హవా కొంతమేరకు తగ్గింది అని అనుకుంటున్న తరుణంలో జైలర్ సినిమాతో బీభత్సమైన హిట్ సాధించి గ్రేట్ కంబ్యాక్ ఇచ్చాడు రజిని.

జైలర్ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్

బీస్ట్ సినిమాతో ఫెయిల్యూర్ చవిచూసిన నెల్సన్ జైలర్ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చి డైరెక్టర్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. మళ్ళీ జైలర్ 2 సినిమాని రజనీకాంత్ తో చేయనున్నాడు నెల్సన్. ఇకపోతే రజనీకాంత్ ప్రస్తుతం టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో పాల్గొంటున్నారు. ఈ సినిమాకి వెట్టైయాన్ అని టైటిల్ ను ఖరారు చేసినట్లు అందరికీ తెలిసిందే.

జై భీమ్ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు టీజే జ్ఞానవేల్. ఆ తర్వాత రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ తో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అయితే ఈ సినిమా భారీ తారాగణంతో తెరకెక్కుతుంది అని చెప్పొచ్చు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, మంజు వారియర్, దగ్గుపాటి రానా వంటి చాలామంది ప్రముఖులు కనిపించనున్నారు.

- Advertisement -

Vettaiyan

రిలీజ్ కు సిద్ధం

అయితే ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో కొంతమేరకు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ షూటింగ్ నిమిత్తం సూపర్ స్టార్ హైదరాబాద్ కి వచ్చిన తరుణంలో చెన్నై ఎయిర్ పోర్ట్ లో కొంతమంది మీడియా ప్రముఖులు రజనీకాంత్ ని సినిమా గురించి అడగగ దాదాపు 70% వరకు పూర్తయిపోయిందని చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ అతి త్వరలో పూర్తికానుంది. సినిమాకు సంబంధించిన అఫీషియల్ రిలీజ్ డేట్ ను కొద్దిసేపటి క్రితమే అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. అక్టోబర్ 10 న ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు