Tamil Movies : సూర్య vs రజినీ.. పోటి మాములుగా లేదుగా..

Tamil Movies : తెలుగు మూవీస్ మాత్రమే కాదు.. తమిళ మూవీస్ కూడా వరుసగా విడుదల కాబోతున్నాయి. అక్కడ కూడా స్టార్ హీరోల సినిమాలు పోటీలో ఉన్నాయి. అక్టోబర్ టు డిసెంబర్ వరకు తమిళ్ లో బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోల సినిమాలు విడుదల కాబోతున్నాయి. అక్టోబర్ 10ని చాలా సినిమాలు లాక్ చేసుకున్నాయి తాజాగా ఆ డేట్ ను మరో సినిమా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతుందని టాక్. ఆ సినిమా ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

సూర్య “కంగువ”..

Rajinikanth, who is going to compete with Suriya, will release his films on the same day
Rajinikanth, who is going to compete with Suriya, will release his films on the same day

తమిళ హీరో సూర్య ప్రస్తుతం సరికొత్త కథతో కంగువా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ సినిమా పై ఆసక్తిని పెంచుతున్నాయి.. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను మేకర్స్ విడుదల చేశారు.. భారీ యాక్షన్ సీన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.. ఇందులో సూర్య, బాబీ డియోల్ ఒకరికొకరు ఎదురుపడటం చూడొచ్చు. టాలీవుడ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది ఏకంగా పది భాషల్లో రిలీజ్ కానుంది. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. 3డీ ఫార్మాట్లోనూ సినిమా రానుంది.. ఈ మూవీ అక్టోబర్ 10న థియేటర్స్ లోకి రాబోతుంది..

రజినీ కాంత్ “వెట్టయాన్ “..

Rajinikanth, who is going to compete with Suriya, will release his films on the same day
Rajinikanth, who is going to compete with Suriya, will release his films on the same day

తమిళ్ సూపర్ స్టార్ రజినీ కాంత్ జైలర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత ఇప్పుడు “వెట్టయాన్ ” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టి.జె జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వెట్టయాన్‌’ నటిస్తున్నాడు తలైవర్. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్. ఆ దశలోనే వెట్టయాన్‌ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ కోసం పోటీ ఏర్పడింది. ఈ మూవీలో మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ తో పాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.అత్యంత భారీ బడ్జెట్ లో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 10 న విడుదల కాబోతున్నట్లు రాఖీ పండుగ సందర్బంగా మేకర్స్ ప్రకటించారు.

- Advertisement -

ఈ అక్టోబర్ 10 న ఇద్దరు స్టార్ హీరోల హీరోల సినిమాలు విడుదల అవుతున్న నేపథ్యంలో తమిళ సినీ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.. ఈ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఏ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు