RajTarun – Lavanya : ఒకే ఇంట్లో రాజ్ తరుణ్ – మాల్వి.. వీడియోతో సహా బయట పెట్టేసిన లావణ్య..

RajTarun – Lavanya : రాజ్ తరుణ్ – లావణ్య ల ప్రేమ వ్యవహారం కేసు తుది దశకు చేరుకుంటుందని తెలుస్తుంది. గత నెలన్నర రోజులుగా ఈ కేసు ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనం రేపుతుండగా, రోజుకో ట్విస్ట్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది. ఆ మధ్య ఆర్జే శేఖర్ లావణ్య ఆడియోలు బయటపెట్టి కేసుని మరింత పెద్దది చేసాడు. ఇప్పుడు అతను బిగ్ బాస్ లోకి వచ్చేసిన విషయం తెలిసిందే. ఇక రాజ్ తరుణ్ (RajTarun) మాత్రం తన సినిమాల కోసం సైలెంట్ అయిపోగా, రీసెంట్ గా సినిమాలు రెండు విడుదలై డిజాస్టర్ కూడా అయిపోయాయి. అయితే ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, తీగ లాగితే డొంక కదులుద్ది అన్నట్టు, కొత్త కొత్త లింకులు ఈ కేసులో వచ్చిపడుతున్నాయి. ఇక తాజాగా రాజ్ తరుణ్ – లావణ్య కేసులో పోలీసులు చార్జ్ షీట్ లో రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేరుస్తూ, లావణ్యతో రాజ్ తరుణ్ పదేళ్లు సహజీవనం చేసినట్లు, లావణ్య (Lavanya) ఆధారాలు వాస్తవమేనని పోలీసులు పేర్కొన్నారు.

రాజ్ తరుణ్ లావణ్యతో ఉంది నిజమే..

ఇక తాజాగా లావణ్య పెట్టిన కేసును దర్యాప్తు చేస్తూ, పోలీసులు లావణ్య చూపించిన సాక్ష్యాలని బట్టి అన్ని వాస్తవమేనని తేల్చేసారు. రాజ్ తరుణ్ , లావణ్య దాదాపు పది సంవత్సరాల పాటు ఒకే ఇంట్లో ఉన్నారని, లావణ్య చెబుతున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయని, లావణ్య ఇంటివద్ద సాక్షాలు సేకరించిన పోలీసులు తమ చార్జిషీటులో రాజ్ తరుణ్ నిందితుడిగా చేరుస్తూ కేసు ఫైల్ చేశారు. ఇక తాజాగా లావణ్య – రాజ్ తరుణ్ కేసులో మరో సంచలన వీడియో బయట పెట్టింది లావణ్య.

RajTarun - Lavanya - Malvi Malhotra Case Update

- Advertisement -

ఒకే ఇంట్లో రాజ్ తరుణ్ – మాల్వి..

రాజ్ తరుణ్ – లావణ్య కేసు చివరిదశకు చేరుకుంటుండగా, కేసును బలోపేతం చేస్తూ లావణ్య మరో సంచలన వీడియో బయటపెట్టింది. రాజ్ తరుణ్ – మాల్వి మల్హోత్రా (Malvi Malhotra) ఒకే ఇంట్లో ఉన్న వీడియోని తాజాగా బయటపెట్టింది లావణ్య. ఆ వీడియో లో రాజ్ తరుణ్ తన భర్తేనని వాదిస్తున్న లావణ్య, వీడియోలో ఒకే ఇంట్లో మాల్వి మల్హోత్రా – రాజ్ తరుణ్ ఉన్న వీడియోని బయటపెట్టింది. అయితే ముంబైలో మాల్వి మల్హోత్రా ఇంట్లో రాజ్ తరుణ్ ఉన్నట్టు తెలిసిపోగా, లావణ్య మాల్వి మల్హోత్రా ఇంటికెళ్లి హల్చల్ చేసిందని తెలుస్తుంది. ఇక ఈ వీడియోలో మాల్విమల్హోత్రా బంధువులు లావణ్యతో వాదిస్తున్నట్టు తెలుస్తుంది. రాజ్ తరుణ్ మాత్రం తనకేమి తెలియనట్టు సైలెంట్ గా కూర్చుని ఉన్నాడు. ఇటు మాల్వి కూడా ఇంట్లో గొడవ చేయొద్దు.. గెట్ అవుట్ అంటూ లావణ్యపై అరుస్తుంది.

లావణ్య వైపు కేసు మొగ్గు?

ఇక తాజాగా ఈ లావణ్య బయట పెట్టిన ఈ వీడియోతో ఎక్కువగా కేసు లావణ్య వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది. రీసెంట్ గా పోలీసులు కూడా లావణ్య కేసులో ఆధారాలు వాస్తవమంటూ తెలుస్తూ చార్జి షీటు నమోదు చేయగా, రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ కూడా తీసుకున్న విషయం తెలిసిందే.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు