Raksha Bandhan Special : అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక గా తెరకెక్కిన చిత్రాలు ఇవే!

Raksha Bandhan Special : సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు భారతదేశం. కుటుంబ విలువలకు, ఆత్మీయతలకు ఎంతో విలువనిచ్చే, రక్త సంబంధాలకు చాలా వ్యాల్యూ ఉంటుంది. ఇక రక్త సంబంధంలో అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ఉండే ప్రత్యేకతే వేరని చెప్పాలి. అమ్మ నాన్న తర్వాత సోదరి ని అన్న, తమ్ముడు కడవరకు అండగా ఉంటారు. ఇక ఈ అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రక్షా బంధన్ జరుపుకోవడం అనాధిగా వస్తున్న సంప్రదాయం. ఇక నేడు రక్షా బంధన్ సందర్బంగా ఫిల్మీ ఫై టీం తరపున శుభాకాంక్షలు తెలుపుతూ, అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా తెరకెక్కిన చిత్రాలపై ఓ లుక్కేద్దాం.

అన్నవరం :

పవన్ కల్యాణ్ అన్నాగా, తమిళ నటి సంధ్య చెల్లిగా నటించిన ఈ చిత్రాన్నీ బీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించగా, రమణ గోగుల మ్యూజిక్ అందించాడు. కష్టమొచ్చిన చెల్లికోసం ఏం చేయడానికైనా ఈ సినిమాలో తాను సిద్ధపడతాడు.

రాఖి :

జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో చెల్లిని అన్యాయంగా చంపేసిన అత్తింటి వారిని చంపి ప్రతీకారం తీర్చుకుంటాడు. తన చెల్లికి జరిగిన అన్యాయం ఏ మహిళకు జరగొద్దని, కష్టమొచ్చిన మహిళలకు అండగా నిలుస్తాడు.

- Advertisement -

పుట్టింటికి రా చెల్లి :

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా అన్నయ్యగా, తెలుగమ్మాయి మధుమిత చెల్లిగా నటించిన ఈ సినిమా, చెల్లెలు సెంటిమెంట్ తో తెరకెక్కగా, కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘పుట్టింటికి రా చెల్లి’. క్లాసిక్ మూవీ గా నిలిచిన ఈ సినిమా కథ విషాదాంతం అవుతుంది.

హిట్లర్ :

మెగాస్టార్ చిరంజీవి, రంభ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. తెలుగు సినిమాల్లో అన్నా చెల్లెళ్ళ పై వచ్చిన సినిమాల్లో వన్ అఫ్ ది బెస్ట్ మూవీ. ఇందులో చిరంజీవి ఐదుగురు అమ్మాయిలకు అన్నయ్యగా నటించారు. చెల్లెళ్లను ప్రయోజకులుగా తీర్చి దిద్ది మంచి ఇళ్లకు కోడళ్లుగా వెళ్లాలని కష్టపడే అన్నయ్య పాత్రలో చిరంజీవి అద్భుతంగా నటించారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి చెల్లెల్లుగా శారద, అనుపమ, లక్ష్మి, గాయత్రి, సరస్వతి నటించారు.

గోరింటాకు :

రాజశేఖర్, మీరా జాస్మిన్ అన్నా చెల్లెళ్లుగా నటించిన ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ పీక్స్ లో ఉంటుంది. కానీ సినిమాలో చివరికి విషాదమే ఉంటుంది. రాజ శేఖర్ కి చివరి హిట్ సినిమా ఇదే.

శివరామరాజు :

జగపతి బాబు, శివాజీ, వెంకట్ అన్నదమ్ములుగా నటించగా, తమిళ అమ్మాయి వీళ్ళకి చెల్లెలిగా నటించింది. కష్టమొచ్చిన చెల్లికి అన్నదమ్ములు కలిసి ఎలా అండగా నిలబడ్డారు అన్న నేపథ్యంలో ఉంటుంది.

అర్జున్ :

అర్జున్ – కీర్తి రెడ్డి అన్నా చెల్లెళ్ళగా నటించిన ఈ సినిమాను గుణ శేఖర్ డైరెక్ట్ చేసాడు. సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా లో సెంటిమెంట్ హృదయానికి హత్తుకుంటుంది.

ఇంకా ఈ సినిమాలే కాకుండా రక్త సంబంధం, ముద్దుల మావయ్య, చెల్లెలి కాపురం లాంటి ఎన్నో తెలుగు చిత్రాలు అన్నా చెల్లెళ్ళ అనుబంధం నేపథ్యంలో వచ్చి మంచి విజయం సాధించాయి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు