Rakul: ఇండియన్ 2 సినిమాపై రకుల్ వ్యాఖ్యలు

Rakul: మామూలుగా ఒక్కొక్కరికి ఒక్క టైం నడుస్తుంది అని చెబుతుంటారు. అలా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ కి కొంత టైం నడిచిందని చెప్పాలి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ తమ ప్రతిభను చూపించి కొంతకాలం పాటు మంచి సినిమాలను చేశారు. అయితే ఒక టైం లో రకుల్ ప్రీత్ సింగ్ కూడా వరుసగా సినిమాలను చేసుకుంటూ స్టార్ హీరోస్ తో జతకట్టింది. రకుల్ చేసిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హీట్ అయ్యాయి. ఆ తర్వాత రకుల్ కి మెల్లగా అవకాశాలు తగ్గడం మొదలయ్యాయి. బాలీవుడ్ లో కూడా సినిమాలు చేయటం మొదలుపెట్టింది. అయితే అక్కడ కూడా సరైన హిట్టు పడక కెరియర్ లో ముందుకు వెళ్లలేదు.

Rakul Preet Singh

ఇకపోతే ప్రస్తుతం రకుల్ ఇండియన్ టు అనే సినిమాలో కీలకపాత్రలో నటిస్తుంది. ఇండియన్ టు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఇండియన్ సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇండియన్ సినిమా అప్పట్లో ఎంతటి పెను సంచలనం సృష్టించిందో మనకు తెలియనిది కాదు. అటువంటి సినిమాకు సీక్వెల్ గా ఒక సినిమా వస్తుంది అని అంటే చాలామంది అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. జులై 12న ఈ సినిమా థియేటర్లోకి రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రకుల్ ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలను పంచుకుంది.

- Advertisement -

ఇండియన్ 2 నిజంగా నా కెరీర్‌లోని ప్రత్యేక సినిమాలలో ఒకటి. దీనికి పెద్ద పెద్ద పేర్లు జతచేయడం వల్ల కాదు, నా క్యారెక్టరైజేషన్‌ని వ్రాసిన విధానం వల్ల ఇది ప్రత్యేకమైనది. భారతీయుడు 2 లో నా పాత్రకు మరియు నా వ్యక్తిగత జీవితానికి మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయి. మాస్టర్ స్టోరీ టెల్లర్ శంకర్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని రకుల్ చెప్పుకొచ్చింది. శంకర్ తనతో పంచుకున్న సూక్ష్మ నైపుణ్యాలను ఎంచుకొని పాత్రను చేయగలిగినట్లు నటి తెలిపింది. ఇండియన్ 2లో సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్, బ్రహ్మానందం, ఎస్‌జె సూర్య, బాబీ సింహా మరియు వివేక్ కూడా కీలక పాత్రలలో కనిపించనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు