Rakul Preet Singh: హీరోయిన్ రకుల్ భర్త పై సంచలన ఆరోపణలు.. ఏం జరిగిందంటే..?

Rakul Preet Singh.. టాలీవుడ్, బాలీవుడ్ లో పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈ మధ్యకాలంలో తెలుగులో ఈమె నటిస్తున్న సినిమాలు చాలా తక్కువ అయినప్పటికీ.. బాలీవుడ్ లో మాత్రం బాగానే అవకాశాలు అందుకుంటుంది.. ఇక టాలీవుడ్ ని వదిలి బాలీవుడ్ కి వెళ్లిన ఈమె అక్కడే.. బాలీవుడ్ నిర్మాత, ప్రముఖ నటుడు అయినా జాకీ బగ్నానీ ని ప్రేమించి మరీ వివాహం చేసుకుంది.. దీంతో బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త కు సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..జాకీ తన దగ్గర పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా.. చాలా ఇబ్బందులు పెడుతున్నారని .. ఆయనపై ఆరోపణలు వినిపిస్తున్నాయి వాటి గురించి పూర్తిగా చూద్దాం.

ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వని జాకీ..

Rakul Preet Singh: Sensational allegations against heroine Rakul's husband.. What happened?
Rakul Preet Singh: Sensational allegations against heroine Rakul’s husband.. What happened?

సినిమా ఇండస్ట్రీ అంటే ఎక్కువగా హీరో హీరోయిన్ల రెమ్యూనరేషన్ గురించే మాట్లాడుతూ ఉంటారు. కానీ అదే సినిమా కు పనిచేసే చాలామందికి వేలల్లో జీతాలు ఉంటాయన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. అలాంటి వారికి రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ ఇవ్వకుండా మోసం చేస్తున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. పూజ ఎంటర్టైన్మెంట్ పేరిట జాకీ ప్రముఖ నిర్మాణ సంస్థ కలిగి ఉన్నారు.. ఇందులో ఉద్యోగులుగా చాలామంది పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ ఉద్యోగస్తులు సైతం తమకు జరిగిన అన్యాయాలను డైరెక్ట్ గా బయట పెట్టడం చర్చనీయాంశంగా మారుతోంది.

బాలీవుడ్ రూల్స్ బ్రేక్ చేసిన రకుల్ భర్త..

మొట్టమొదటిసారిగా 1986లో పూజ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ను నిర్మించారట.అలా ఆ సంస్థలో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్టు చిత్రాలను కూడా తీశారు. ఆ తర్వాత సినిమాలు చేస్తున్నా.. సక్సెస్ లేకపోవడంతో ఈ సంస్థ వెనుకడుగు వేసింది.. ఇటీవలే తీసిన బడే మియా చోటా మియా అనే సినిమా కూడా భారీ నష్టాలను మిగిల్చింది.. ఈ క్రమంలో ఈ చిత్రానికి పని చేసినందుకుగాను తమకు జీతాలే ఇవ్వలేదంటూ కొంతమంది ఉద్యోగస్తులు సోషల్ మీడియాలో పలు రకాల పోస్టులను షేర్ చేస్తున్నారట. అన్ని ఇండస్ట్రీలకు కొన్ని రూల్స్ ఉంటాయి. అలా బాలీవుడ్ లో కూడా పలు రకాల రూల్స్ ఉన్నాయట.

- Advertisement -

రెండేళ్లుగా జీతాల కోసం ఎదురుచూస్తున్నాం అంటున్న ఉద్యోగస్తులు..

అవేమిటంటే ఏదైనా సినిమా పూర్తి అయ్యిందంటే 45 నుంచి 60 రోజుల లోపై వారి పూర్తి బకాయిలను సైతం చెల్లించాల్సి ఉంటుంది.. కానీ జాకీభగ్నానీ తన సంస్థలో పని చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు రెండు ఏళ్ళుగా జీతాలు ఇవ్వలేదని ఆ ఉద్యోగస్తులు పబ్లిక్ గా తెలియజేస్తున్నారు. పూజా సంస్థలో పనిచేస్తున్న వైష్ణవి అనే ఉద్యోగి మాట్లాడుతూ.. తమతో పని చేసిన 100 మందికి ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వలేదని… ఈ జీతం కోసం గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్నామంటూ వెల్లడించింది.

తిండి కూడా సరిగా పెట్టడం లేదని కామెంట్..

మరొక ఉద్యోగి మాట్లాడుతూ.. అవుట్డోర్ షూటింగ్ చేస్తున్నప్పుడు తమకు సరైన తిండి పెట్టరని.. మూడు నెలలుగా పని చేస్తే కేవలం రెండు నెలల జీతాలు ఎగరగొట్టి ఒక నెలది మాత్రమే ఇస్తామని చెబుతున్నారని తెలిపారు..ఈ విషయాలన్నీ ఇప్పుడు బయటికి చెప్పడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తమలాగా ఎవరు ఇబ్బందులు పడకూడదని.. జాగ్రత్త పడతారని.. అందుకే ఇలాంటి పోస్ట్లు షేర్ చేస్తున్నామంటూ జాకీ నిర్మాణ సంస్థల పైన ఆరోపణలు వినిపిస్తున్నాయి.. మరి వీటి పైన అటు రకుల్ , జాకీ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు