Rakul Preet Singh : అప్పుల్లో నిండా మునిగిన భర్త… టాలీవుడ్ లో ట్రయల్స్ మొదలెట్టిన రకుల్

Rakul Preet Singh : సౌత్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు పెళ్ళికి ముందే టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిన విషయం తెలిసిందే. ఇక పెళ్లయ్యాక పలు బాలీవుడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ బ్యూటీ ఇటీవల తన భర్త, మామకు సంబంధించిన నిర్మాణ సంస్థ పూజ ఎంటర్టైన్మెంట్స్ వందల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది అన్న విషయంతో వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలోనే తాజాగా తాను టాలీవుడ్ లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

టాలీవుడ్ లో ఛాన్స్ కోసం వెయిటింగ్

ప్రస్తుతం కమల్ హాసన్ నటించిన హై-ఆక్టేన్ థ్రిల్లర్ ఇండియన్ 2 కోసం సిద్ధమవుతున్న రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా తన అభిమానుల కోసం కొంత సమయం కేటాయించింది. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఆస్క్ మి ఎనీథింగ్ సెషన్‌ను హోస్ట్ చేసింది. రకుల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ సెక్షన్‌కి వెళ్లి తెలుగు పరిశ్రమకు తిరిగి రావడం గురించి తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. టాలీవుడ్ కు ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తారు అనే ప్రశ్నకు రకుల్ స్పందిస్తూ “నా తెలుగు అభిమానులందరినీ నేను నిజంగా మిస్ అవుతున్నాను, త్వరలో తెలుగు సినిమా చేయాలనుకుంటున్నాను. నేను సరైన స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నాను. బహుశా నాలోని ఒక భాగమైన తెలుగు అమ్మాయి నిజంగా తెలుగును కోల్పోయిందని నేను భావిస్తున్నాను. కాబట్టి త్వరలోనే తిరిగి రావచ్చు. నేను కొన్ని స్క్రిప్ట్ లు వింటున్నాను. అతి త్వరలోనే టాలీవుడ్ కు తిరిగి వస్తా” అని వెల్లడించి, తన అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. రకుల్ ప్రీత్ సింగ్ చివరిగా తెలుగులో వైష్ణవ్ తేజ్ సరసన కొండపొలం అనే సినిమాలో కన్పించింది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ సినిమా 2021లో రిలీజ్ అయ్యింది.

Rakul Preet Singh kickstarts shooting for 'De De Pyaar De 2' on the  occasion of its 5th anniversary!

- Advertisement -

రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలు

రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం దర్శకుడు శంకర్ షణ్ముగం దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది. జూలై 12 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జే సూర్య, బాబీ సింహా, ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్, ఇతర నటీనటులు నటించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా మ్యూజిక్ కంపోజర్ గా అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ పొలిటికల్ థ్రిల్లర్ చిత్రాన్ని నిర్మిస్తోంది. హిందీ వెర్షన్‌కు హిందుస్తానీ 2, తెలుగు వెర్షన్‌కు భారతీయుడు 2 అని పేరు పెట్టారు. ఈ చిత్రం జూలై 12న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాతో పాటు దే దే ప్యార్ దే 2, కామెడీ-డ్రామా చిత్రం మేరే హస్బెండ్ కి బివితో సహా పలు బాలీవుడ్ ప్రాజెక్ట్‌లలో రకుల్ కనిపించనుంది. ఇక ఇప్పుడేమో తెలుగు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్టు వెల్లడించింది. అలాగే ఈ ఇంస్టా సెషన్ లో పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు