Rakul Preeth Singh: నాకు ఆ హీరో తో చేయాలని ఉంది, ఇప్పటివరకు నేను అతనితో చేయలేదు

Rakul Preeth Singh: మామూలుగా ఒక్కొక్కరికి ఒక్క టైం నడుస్తుంది అని చెబుతుంటారు. అలా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ కి కొంత టైం నడిచిందని చెప్పాలి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ తమ ప్రతిభను చూపించి కొంతకాలం పాటు మంచి సినిమాలను చేశారు. అయితే ఒక టైం లో రకుల్ ప్రీత్ సింగ్ కూడా వరుసగా సినిమాలను చేసుకుంటూ స్టార్ హీరోస్ తో జతకట్టింది. రకుల్ చేసిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హీట్ అయ్యాయి. ఆ తర్వాత రకుల్ కి మెల్లగా అవకాశాలు తగ్గడం మొదలయ్యాయి. బాలీవుడ్ లో కూడా సినిమాలు చేయటం మొదలుపెట్టింది. అయితే అక్కడ కూడా సరైన హిట్టు పడక కెరియర్ లో ముందుకు వెళ్లలేదు.

ఇకపోతే ప్రస్తుతం రకుల్ ఇండియన్ టు అనే సినిమాలో కీలకపాత్రలో నటిస్తుంది. ఇండియన్ టు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఇండియన్ సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇండియన్ సినిమా అప్పట్లో ఎంతటి పెను సంచలనం సృష్టించిందో మనకు తెలియనిది కాదు. అటువంటి సినిమాకు సీక్వెల్ గా ఒక సినిమా వస్తుంది అని అంటే చాలామంది అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. జులై 12న ఈ సినిమా థియేటర్లోకి రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూస్ లో పాల్గొంటుంది రకుల్.

Rakul Preet Singh

- Advertisement -

ఇకపోతే ప్రతి హీరోయిన్ కి ఆ హీరోతో పని చేయాలి అని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. అలా రకుల్ కూడా ఒక హీరోతో పని చేయాలని ఉంది అని రివిల్ చేసింది. ఇప్పటివరకు ఇళయ దళపతి విజయ్ తో తను సినిమాను చేయలేదని, ఆయనతో కలిసి పని చేయాలని నాకు ఉంది అని రకుల్ రివీల్ చేసింది. అయితే తలపతి విజయ్ ప్రస్తుతం హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్69 మూవీని చేస్తున్నాడు. ఆ సినిమాలో ఒకవేళ అవకాశం వస్తే ఏమీ ఆలోచించకుండా పక్కన ఓకే చెప్పేస్తాను అంటూ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ సినిమా కాకపోయినా ఒకవేళ మళ్లీ విజయ్ సినిమాలు చేయడం మొదలుపెడితే తనతో పాటు కలిసి నటించాలని ఉంది అని చెప్పుకొచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు