Bharateeyudu2 PreReleaseEvent : కమల్ సార్ సినిమా 50 సార్లు చూసాను – రకుల్ ప్రీత్

Bharateeyudu2 PreReleaseEvent : కమల్ హాసన్ శంకర్ షణ్ముగం లో తెరకెక్కిన ఇండియన్2 సినిమా జులై12న థియేటర్లలో విడుదల కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తెలుగులో భారతీయుడు2 పేరుతో విడుదల కానుంది. కాగా తాజాగా భారతీయుడు2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 7న హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ ఈవెంట్ కి కమల్ హాసన్ శంకర్ సహా చిత్ర యూనిట్ అందరూ హాజరయ్యారు. అలాగే మూవీ మేకర్స్ మాట్లాడిన స్పీచ్ లు నెట్టింట వైరల్ అవుతుండగా, ఈ సినిమా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడిన స్పీచ్ కూడా వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాలో సిద్ధార్థ్ కి జోడిగా రకుల్ ప్రీత్ నటించిన విషయం తెలిసిందే.

Rakul Preeth Singh Seech At Bharateeyudu2 Pre Release Event

కమల్ సార్ మూవీ ని 50 సార్లు చూసా..

ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ (Bharateeyudu2 PreReleaseEvent) లో రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. చాలా రోజుల టైం తర్వాత హైదరాబాద్ వచ్చాను.. స్పెషల్లీ ఇండియన్2 సినిమా కోసమే వచ్చాను అంది. అలాగే ఈ సినిమాలో తన రోల్ పై నమ్మకం పెట్టినందుకు, ఈ పాత్ర ఇచ్చినందుకు శంకర్ కి థ్యాంక్స్ చెప్తూ..ఈ సినిమాలో భాగం అవడం తన అదృష్టం అంది. అలాగే కమల్ హాసన్ గురించి మాట్లాడుతూ… కమల్ సార్ కి తాను చాలా పెద్ద ఫ్యాన్ అని, అయన హిందీలో నటించిన ‘చాచి420’ సినిమా యాభై సార్లు చూసానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆయనతోనే స్క్రీన్ షేర్ చేసుకోవడం తన డ్రీం అని చెప్పుకొచ్చింది. అలాగే ఈ సినిమాలో నటించిన తన కో స్టార్ సిద్ధార్థ్ తో సహా అందరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకొచ్చింది.

- Advertisement -

వరల్డ్ వైడ్ రిలీజ్ కి రెడీ..

ఇక కమల్ హాసన్ నటించిన ఆ చాచి420 సినిమా, తెలుగులో భామనే సత్యభామనే పేరుతో తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సిద్ధార్థ్, బ్రహ్మానందం, ఎస్.జె. సూర్య, బాబీ సింహ తదితరులు పాల్గొనగా, రచయితలు సుద్దాల అశోక్ తేజ, కాసర్ల శ్యామ్, రామ జోగయ్య శాస్త్రి కూడా పాల్గొన్నారు. ఇక ఇండియన్2 సినిమాకి అనిరుద్ మ్యూజిక్ అందించగా, లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మించగా, జులై 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు