Rakul Preet: డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ తమ్ముడు అరెస్ట్..

Rakul Preet: సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం రోజు రోజుకు పెరిగిపోతుందని ఇటీవల వెలుగు చూస్తున్న సంఘటనలే ఉదాహరణ.. బాలీవుడ్ లో సుశాంత్ రాజ్ పుత్ మరణం తర్వాత డ్రగ్స్ కేసులో ఒక్కొక్కరి పేరు బయటకు వస్తుంది. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలకు సమన్లు అందాయి. ఇప్పుడు తాజాగా మరో స్టార్ హీరోయిన్ తమ్ముడు అరెస్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ ను హైదరాబాద్ నార్కొటిన్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అమన్ డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.. గతంలో చాలా సార్లు డ్రగ్స్ వార్తల్లో అమన్ పేరు వినిపించింది. కానీ ఎక్కడ ఆధారాలు లేకపోవడంతో పోలీసులు పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తుంది. ఈరోజు అమన్ డ్రగ్స్ తీసుకుంటూ అడ్డగంగా బుక్ అయ్యాడు .. అతని దగ్గర నుంచి రెండు కోట్లు విలువ చేసే డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అమన్ తో పాటుగా మరికొంతమంది సినీ ప్రముఖులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. పోలీసులు వారి పేర్లను గోప్యంగా ఉంచినట్లు తెలుస్తుంది. ఇక ప్రముఖ వ్యాపారవేత్తలు, నైజీరియన్స్ కూడా ఈ కేసులో నార్కొటిన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. రకుల్ ప్రీత్ తమ్ముడు దొరకడంపై ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.. రకుల్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. మొన్న తన భర్త ఆస్తులు పోగొట్టుకోవడం, నేడు తమ్ముడు అరెస్ట్ అవ్వడం .. ఈ విషయం పై ఈ ముద్దుగుమ్మ ఎలా స్పందిస్తుందో చూడాలి..

- Advertisement -

ఇక రకుల్ సినిమాల విషయానికొస్తే ..

ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలను లైన్లో పెడుతూ బిజీగా ఉందన్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఈ పాప ఇండియన్ 2 సినిమాలో మెరిసింది.. ఆ సినిమా అంతగా హిట్ టాక్ ను అందుకున్నట్లు లేదు.. ఇప్పుడు బాలీవుడ్ సినిమాలతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది..

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు