Ram Charan at IFFM : ఆస్ట్రేలియా వరకు గ్లోబల్ స్టార్ రేంజ్… తెలుగులో ఎవ్వరికీ సాధ్యం కాలేని గౌరవం ఇది

Ram Charan at IFFM : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక హీరోగా ప్రూవ్ చేసుకోవడం ఎంత కష్టమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలుగా ప్రూవ్ చేసుకున్నారు. అయితే మంచి బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా ప్రాపర్ గా ఒక హిట్ సినిమా లేకపోతే ఇక్కడ హీరోల్ని అంతగా ఎవరూ ఆదరించరు. ఫెయిల్యూర్స్ ని సక్సెస్ ని ఇండస్ట్రీలో డీల్ చేసే విధానం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించిన దర్శకులు కూడా నేడు ఒక హిట్టు కోసం తలలు పట్టుకుంటున్నారు.

చిరుత సినిమాకు తో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. మొదటి సినిమాతోనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మంచి హీరో దొరికాడు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి కూడా దాటేశాడు అని అక్కడక్కడ మాటలు కూడా వినిపించాయి. హీరో సునీల్ కూడా మగధీర ఆడియో రిలీజ్ ఫంక్షన్లు మెగాస్టార్ ముందు ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ఆ తర్వాత ఆరెంజ్ అనే సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఇకపోతే వరుసగా సినిమాలు చేస్తున్న తరుణంలో ఆ రంగస్థలం సినిమా రామ్ చరణ్ కెరియర్ ని మలుపు తిప్పింది. రామ్ చరణ్ లో ఎంత గొప్ప నటుడు ఉన్నాడా అనిపించేలా పర్ఫామెన్స్ చేశాడు ఆ సినిమాలో.

Ram Charan

- Advertisement -

ఇకపోతే రీసెంట్ గా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమా ఎంత ఎంత పెద్ద ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దీంతో రాంచరణ్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. చరణ్ కి ఈ సినిమాతోనే గ్లోబల్ స్టార్ గా గుర్తింపబడా లభించింది. ఇకపోతే చరణ్ కి మరో అరుదైన అవకాశం దక్కింది.ఆగస్ట్‌లో 15వ వార్షిక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (IFFM)లో పాల్గొననున్నారు రామ్ చరణ్. ఈ కార్యక్రమంకి A.R రెహమాన్, కరణ్ జోహన్, రాజ్ కుమార్ హిరానీ, ఇంతియాజ్ అలీ, కబీర్ ఖాన్ వంటి దర్శకులు, నిర్మాతలు కూడా హాజరు కానున్నారు. అయితే హీరోల్లో రామ్ చరణ్ మాత్రమే ఉండటం విశేషం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు