Mega family: రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టిన రామ్ చరణ్ దంపతులు !

రామ్ చరణ్, ఉపాసన ఎట్టకేలకు తల్లితండ్రులుగా ప్రమోషన్ తీసుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున ఉపాసన పండంటి ఆడపిల్లకి జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీలో పండగ వాతావరణం నెలకొంది. నిన్న సాయంత్రం రామ్ చరణ్, ఉపాసనని హాస్పిటల్ లో చేర్పించగా, ఈరోజున ఉదయం డెలివరీ చేయబోతున్నాం అని డాక్టర్స్ తెలిపారు . దాంతో నిన్నటి నుంచి అందరు మెగా ఫ్యామిలీకి వారసుడు వస్తాడా లేక వారసురాలు వస్తుందా అని అంత వెయిట్ చేస్తూ ఉండగా, ఈ రోజు ఉదయం అందరికి సంతోషాన్ని కలిగించే ఆ చల్లని వార్త అందింది.

రామ్ చరణ్ మరియు ఉపాసనకు జూన్ 14, 2012 న పెళ్లైన సంగతి అందరికి తెలిసిందే. ఉపాసన వ్యాపారాల్లో, రామ్ చరణ్ సినిమాల్లో బిజీ గా ఉండటం కారణంగా కొద్దిరోజుల పాటు పిల్లలు వద్దనుకున్నారు. దాంతో వీరిద్దరి వైవాహిక జీవితం బాగాలేదని, అందుకే పిల్లలు పుట్టడం లేదని చాలా మంది, చాలా రకాలుగా ఎవరికి తోచింది వాళ్ళు రాస్తూ మాట్లాడుతూ వచ్చారు. కానీ ఉపాసన రామ్ చరణ్ లకు పరస్పరం ఒకరిపట్ల ఒకరికి ఉన్న ప్రేమ వాళ్ళ వీరిద్దరిపైన వచ్చే న్యూస్ లు , రూమర్స్ ఏమి చేయలేకపోయింది.

అయితే ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ ఉన్న సమయంలో ఉపాసన కన్సీవ్ అవడంతో మెగా ఫ్యామిలిలో సంతోషం నెలకొంది. ఆ తరువాత నుంచి రామ్ చరణ్, ఉపాసనని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇటీవలనే బేబీ షవర్ ఫంక్షన్ కూడా అట్టహాసంగా చేసిన రామ్ చరణ్ తండ్రి కాబోతున్న అనే ఆనందంతో ఉంటుండగా ఇవాళ ఉదయం ఉపాసనకు పాపా పుట్టడంతో రామ్ చరణ్ మరియు మెగా ఫ్యామిలిలో అంత సంతోషంతో ట్విట్టర్ లో మెగా ప్రిన్సెస్ కి అంత వెల్ కమ్ చెబుతున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు