Ram Charan: చంద్రబోస్ రాసాడు, చరణ్ నిజం చేసాడు

“చిరుత” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తేజ్ మొదటి సినిమాతోనే చిరు తనయుడు అనిపించుకున్నాడు. మెగాస్టార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన చరణ్ మెగస్టార్ కి ప్రపంచవ్యాప్తంగా మరికొంత గుర్తింపును తీసుకొచ్చాడు అనడం అతిశయోక్తి కాదు.
చిరంజీవి అనే బాధ్యత మోస్తూ అంచలంచెలుగా ఎదిగాడు చరణ్.

వాస్తవానికి చరణ్ మొదట్లో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. నటనలో తన తండ్రిని అనుకరిస్తున్నాడు అంటూ ఆయనపై విమర్శలు చేసినవాళ్లు కోకొల్లలు. కానీ ఏ రోజు చరణ్ వాళ్లకు సమాధానం చెప్పలేదు.
తన మొదటి సినిమా 2007 లో చిరుత సినిమా రిలీజ్ అయినప్పుడు.
చిరంజీవి అంత కాకపోయినా,డాన్స్ లు అవి బాగానే చేసాడు,మదర్ సెంటిమెంట్ వలన సినిమా ఆడేస్తుంది అన్నారు.

2009 లో మగధీర, ఈ సినిమా విషయంలో పెద్దగా కంప్లైంట్స్ ఏమి లేవు, కాంప్లిమెంట్స్ తప్ప.
2010 ఆరెంజ్,తెలిసిందే కదా ఓటమి ఎప్పుడూ ఒంటరిగా కాకుండా విమర్శలను తీసుకొస్తుంది అని. ఇక్కడ అదే జరిగింది.
2012 రచ్చ,సినిమా ఏమీలేదు ప్రతీ డైలాగ్ లో చిరంజీవిను ఇమిటేట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. తనకంటూ ఒక స్టైల్ లేదు అన్నారు.
2013 నాయక్ పర్వాలేదు. తర్వాత జంజీర్/తుఫాన్ మళ్ళీ విమర్శల పర్వం.ఆ తరువాత ఎవడు,గోవిందుడు అందరివాడేలే,బ్రూసిలి మంచి సినిమాలే కానీ ఎక్కడో చిన్న అసంతృప్తి.

- Advertisement -

తరువాత ధ్రువ, ఎత్తిన నోళ్లు మూసుకోవడం మొదలయింది.
తరువాత రంగస్థలం, మూసిన నోళ్లపై ఆశ్చర్యంగా చేయి అడ్డుపెట్టడం మొదలయ్యింది. ఇప్పుడు RRR చరణ్ గురించి ఇప్పుడు ప్రపంచం మాట్లాడుకోవడం మొదలు పెట్టింది.
తండ్రికి తగ్గ తనయుడు నుండి తండ్రిని మించిన తనయుడు వరకు సాగిన రామ్ చరణ్ ప్రయాణం ఒక అద్భుతమని ఘంటాపథంగా చెప్పొచ్చు.

మెగాపవర్ స్టార్ నేడు గ్లోబల్ స్టార్ అయ్యాడు, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.? ఒక పదకుండేళ్ళ క్రితమే చరణ్ ఈ స్థాయిని గెస్ చేసాడు ప్రముఖ సాహిత్య రచయిత చంద్రబోస్. చంద్రబోస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. నాటు నాటు వంటి పాటలే కాకుండా. గుండెల్లో నాటుకుపోయి మనలో కొత్త జీవాన్ని నింపే పాటలు కూడా రాసాడు ఆయన.
ప్రతిరోజూ విలువైంది కాదా
ప్రయత్నిస్తే గెలుపేదో రాదా అని ప్రశ్నించడం కూడా ఆయన పెన్నుకు తెలుసు.

ఇక అసలు విషయానికి వస్తే రామ్ చరణ్ కి రీసెంట్ గా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. చరణ్ గ్లోబల్ స్టార్ అవుతాడని ఇదివరకే తన పాటలో రాసారు చంద్రబోస్ అదే ఇప్పుడు నిజమైంది. సంపత్ నంది దర్శకత్వం వహించిన రచ్చ సినిమా టైటిల్ సాంగ్ లిరిక్స్ లో He is gonna be a google star, He is gonna be a global star అని చంద్రబోస్ రాసిన మాటలను మనం గమనించవచ్చు. చంద్రబోస్ ఏ నిమిషంలో ఏ ఉద్దేశ్యంతో రాసారో కానీ చరణ్ ఈ రోజు దానిని నిజం చేసాడు.

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు