Raayan : రాయన్ సక్సెస్ తో చెర్రీ ఫ్యాన్స్ హ్యాపీ! ఎందుకంటే?

Raayan : కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన రాయన్ సినిమా థియేటర్ల వద్ద సూపర్ సక్సెస్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాని హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాడన్న సంగతి తెలిసిందే. ధనుష్ ల్యాండ్ మార్క్ 50వ సినిమాగా తెరకెక్కిన రాయన్ సినిమా జులై 26న తెలుగు, తమిళ భాషల్లో విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ తో అదిరిపోయే కలెక్షన్లు వసూలు చేస్తుంది. మొదట అంతగా టాక్ లేకపోయినా, మౌత్ టాక్ స్ప్రెడ్ అయి భారీ వసూళ్లు అందుకుంటుంది. ఇప్పటికే 80 కోట్ల వసూళ్లను దాటేసిన రాయన్ సినిమా వంద కోట్ల దిశగా దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా రాయన్ సినిమా సూపర్ సక్సెస్ తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ధనుష్ సినిమా హిట్ అయితే చెర్రీ ఫ్యాన్స్ సంబరపడిపోవడమేంటి అనుకుంటున్నారా? దానికి వేరే కారణం ఉందిలే.

Ram Charan fans are happy with the success of Raayan movie

రాయన్ సక్సెస్ తో చెర్రీ ఫ్యాన్స్ ఖుషీ..

అయితే ధనుష్ రాయన్ సినిమా సక్సెస్ తో రామ్ చరణ్ ఫ్యాన్స్ హ్యాపీ అవుతున్నారు. ఎందుకంటే ఈ సినిమాకు తొలుత రిలీజ్ అయ్యాక మిశ్రమ స్పందన లభించింది. కానీ సెకండాఫ్ లో ధనుష్ సాలిడ్ స్క్రీన్ ప్లే కి తోడు, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్ అద్భుతమైన బీజీఎమ్ సినిమాని ఓ రేంజ్ లో నిలబెట్టింది. పైగా పాటలు కూడా సినిమాకి తగ్గట్టు సూపర్ హిట్ అయ్యాయి. రిలీజ్ కి ముందు అంతా లేకపోగా, సినిమాలో చూస్తుంటే స్లో గా ఎక్కేస్తున్నాయి. అయితే ఇప్పుడు రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కబోయే సినిమాకు (RC16) ఏఆర్ రహమాన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

మొన్నటి వరకు బుచ్చిబాబు చరణ్ సినిమాకు ఏ దేవిశ్రీ నో, లేదా థమన్ నో, లేదా అనిరుద్ ని తీసుకుంటారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా రహ్మాన్ ని బుచ్చిబాబు సెలెక్ట్ చేసుకోవడంతో చాలామంది అసహనంగా ఫీలయ్యారు. దానికి రెహమాన్ తెలుగు సినిమాల ట్రాక్ ఒక కారణం అయితే, ఈ మధ్య కాలంలో రహమాన్ నుండి వచ్చిన సినిమాలు కూడా మ్యూజిక్ పరంగా అంత ఫ్రెష్ గా లేకపోవడం మరో కారణం. కానీ లేటెస్ట్ గా వచ్చిన ధనుష్ రాయన్ కు అద్భుతమైన రహమాన్ మ్యూజిక్ స్కోర్ చాలా ప్లస్ అయింది. రహమాన్ బీజీఎమ్ వల్లే కొన్ని సీన్లు పేలాయి. దీంతో ఇప్పుడు చరణ్ పెద్ది సినిమాకు కూడా మంచి సాలిడ్ మ్యూజిక్ ఇస్తాడని చెర్రీ ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఇక ధనుష్ రాయన్ సినిమా వంద కోట్ల దిశగా దూసుకుపోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు