Game Changer : దిల్ రాజు ఈసారి గట్టిగా ఫిక్స్ అయ్యాడు!

Game Changer : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్టుల్లో “గేమ్ ఛేంజర్” కూడా ఒకటి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ షణ్ముగం కాంబినేషన్ లో మూడున్నరేళ్లుగా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గత ఏడాది కాలంగా షూటింగ్ డిలే అవుతూ, వాయిదాల పర్వం కంటిన్యూ చేస్తూ వస్తుంది. ఇప్పటివరకూ ఈ సినిమా విడుదల తేదీ అనౌన్స్ కాకపోవడం ఆశ్చర్యంగా ఉంది. దీని తర్వాత స్టార్ట్ అయిన ఇతర స్టార్ హీరోల సినిమాలు విడుదల అవడం కూడా జరిగిపోయాయి. కానీ ఈ సినిమా విడుదలకి సంబంధించి ఎప్పట్నుంచో సందిగ్ధత నడుస్తోంది. పలుమార్లు షూటింగ్ ఆగిపోవడం.. వాయిదా పడడం.. షెడ్యూళ్లు తారుమారు కావడంతో ఈ చిత్రం అనుకున్న దాని కంటే చాలా ఆలస్యంగా విడుదల కాబోతోంది. దీనికి అన్నిటికంటే పెద్ద కారణం ఇండియన్2 అని తెలిసిందే. ఆగిపోయిన ఆ సినిమా మళ్ళీ స్టార్ట్ చేసారు కాబట్టే, దెబ్బ గేమ్ ఛేంజర్ పై పడింది. ఇక నిర్మాత దిల్ రాజు కూడా ఇన్నాళ్లూ చూస్తూ వచ్చాడు. ఇకపై రిలీజ్ డేట్ విషయంలో దిల్ రాజు గట్టి నిర్ణయానికి వచ్చాడని తెలుస్తుంది.

Ram Charan Game Changer Movie Release Date Latest Update

ఈ సారి గట్టిగా ఫిక్స్ అయిన దిల్ రాజు…

ఇక గేమ్ చేంజర్ (Game Changer) షూటింగ్ ఐతే లేటైతే అయింది. కనీసం రిలీజ్ ఎప్పుడన్నది అయినా చెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ ఈ విషయాన్ని ఇంకా నాన్చుతూనే ఉంది టీం. తన ప్రొడక్షన్లో వచ్చే ప్రతి సినిమాకూ అన్ని వ్యవహారాలను తన గుప్పెట్లో పెట్టుకుని ఫుల్ క్లారిటీతో ఉండే దిల్ రాజు.. శంకర్ సినిమా అయ్యేసరికి నిమిత్త మాత్రుడిగా మారిపోయాడు. ఓవైపు అభిమానులు గోల గోల చేస్తుంటే.. ఆయన మౌనవ్రతం పాటించారు. ఐతే ఎట్టకేలకు శంకర్‌తో కమిట్మెంట్ తీసుకుని రిలీజ్ డేట్ విషయంలో దిల్ రాజు తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇక గేమ్ చేంజర్ ని సెప్టెంబర్ 27 లేదా, అక్టోబర్ 10న తీసుకువస్తారని అనుకున్నా, ఇప్పుడు వేరే పండక్కి తీసుకువస్తున్నారని సమాచారం.

- Advertisement -

దీపావళికి దించబోతున్నాడట..

తాజా సమాచారం ప్రకారం ఈ ఏడాది దీపావళికి ‘గేమ్ చేంజర్’ దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోందట. అన్ని రకాలుగా ఆలోచించి ఈ డేట్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. టాలీవుడ్‌ కు దీపావళి అంత స్పెషలేమీ కాదు. కానీ బాలీవుడ్, కోలీవుడ్లో దీపావళికి క్రేజీ సినిమాలు రిలీజవుతుంటాయి. ఆయా ఇండస్ట్రీల నుంచి పోటీ ఉన్నా సరే.. దీపావళికే ‘గేమ్ చేంజర్’ను రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారట. దసరాకు సినిమాను రెడీ చేయడం కష్టమని.. డిసెంబరుకు వెళ్దామంటే ఆల్రెడీ చాలా సినిమాలు ఉన్నాయని..అందుకే దీపావళినే బెస్ట్ డేట్ అని టీం ఫిక్సయిందట. ఇక త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారట. ఈ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ ఒకట్రెండు రోజులు షూట్‌లో పాల్గొంటే సరిపోతుంది. మిగతా టాకీ పార్ట్‌ను కూడా త్వరలోనే పూర్తి చేస్తారట. ‘ఇండియన్-2’ రిలీజయ్యాక శంకర్ పూర్తిగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పడిపోతాడు. ఇక గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ పై మేకర్స్ నుండి క్లారిటీ వచ్చే దాకా ఆగాలి.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు